మోడీకి యాంటీగా తెలుగు రాజకీయం ?

Satya
మోడీ అంటే మోజు. మోడీ అంటే క్రేజ్. మోడీ అంటే బలమైన నేత. దేశానికి ఆయనే అతి పెద్ద దిక్కు. ఇదంతా ఏడేళ్ళ కిందటి ముచ్చట. మోడీ రెండు సార్లు వరసబెట్టి గెలిచారు. అంతే కాదు. ఆయన ఫుల్ మెజారిటీని కూడా బీజేపీకి సాధించి పెట్టారు.
అయితే మోడీ హ్యాట్రిక్ కొట్టగలరా. మోడీ వేవ్ 2024 ఎన్నికల్లో పనిచేస్తుందా అంటే జవాబు చెప్పడం కష్టం. ఎందుకంటే ఉత్తరాదిన మోడీ క్రేజి బాగా తగ్గుముఖం పట్టింది. దానికి అనేక రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో జరిగిన ఉప ఎన్నికలు సాక్ష్యం. బీజేపీకి గట్టి పట్టున్న హిమాచల్ ప్రదేశ్ లాంటి చోట్ల ఆ పార్టీ దారుణంగా ఓడిపోయింది.
దాంతో మోడీ వేవ్ ఏమీ లేదని విపక్షాలు నిర్ధారణకు వచ్చేస్తున్నాయి. ఇక మరో లిట్మస్ టెస్ట్ మిగిలి ఉంది. అదే దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన యూపీలోనే . అక్కడ కనుక బీజేపీకి తేడా వస్తే మాత్రం ఇక 2024 ఎన్నికలు టఫ్ గానే బీజేపీకి ఉన్నట్లు లెక్క. అందుకే దేశంలో రాజకీయాన్ని మారుస్తామని మమతా బెనర్జీ సహా అంతా రెడీ అవుతున్నారు.
మరి రెండు తెలుగు రాష్ట్రాలు ఎటు వైపు అన్న చర్చ వస్తోంది. ఈ రోజుకు అయితే కేసీయార్ తప్ప ఏపీ నుంచి ఎవరూ మోడీని విమర్శించడంలేదు. అయితే రోజులు అన్నీ ఒకేలా ఉండవని అంటున్నారు. యూపీ ఎన్నికల తరువాత ఏపీ రాజకీయం కూడా మారుతుంది అంటున్నారు. అక్కడ బీజేపీ ఓడితే మాత్రం చంద్రబాబు నాయకత్వాన టీడీపీ కొత్త రాజకీయ  నిర్ణయాలు తీసుకునే చాన్స్ ఉంది. ఇక జగన్ ఇప్పటికిపుడు బయటపడకపోయినా 2024 ఎన్నికల ముందో తరువాతనో యాంటీ మోడీ స్టాండ్ అందుకోవడం ఖాయం. మొత్తానికి తెలుగు రాష్ట్రాలో మోడీ టీం ఎవరూ అంటే ఇపుడే చెప్పడం కష్టం. అలాగని ఈ రోజున ఎవరూ ఉన్నారని కూడా లేదు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: