రేసులోకి కొత్త ప్రధాని అభ్యర్థి.. ఎవరో తెలుసా?

praveen
ఇటీవలి కాలంలో వారసత్వ రాజకీయాలు ఎక్కువైపోయాయి. ఒక పార్టీ అధినేతగా కొనసాగుతున్న వ్యక్తులు ఆ తర్వాత కేంద్రంలో రాజకీయాల్లోకి అడుగు పెట్టడం ఆ తర్వాత వారి వారసులు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గా మారడం లాంటివి జరుగుతున్నాయి. ఇక ఇలాంటి వ్యూహాలతో ప్రస్తుతం సీనియర్ రాజకీయ నాయకులు ముందుకు సాగుతున్నారు అన్న విషయం తెలిసిందే. గత రెండు పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో కొనసాగుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి ఘన విజయాన్ని సాధించి రెండుసార్లు అధికారం చేపట్టింది ఎన్డీఏ ప్రభుత్వం.

 అయితే థర్డ్ ఫ్రంట్ ద్వారా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఎంతో మంది భావిస్తున్నారు. దీని కోసం కొన్ని పార్టీలు మొత్తం ఒక గ్రూపుగా ఏర్పడి ఇక పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి ఏకంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఇప్పటికే ఎన్నో సార్లు ప్రయత్నాలు చేశారు అన్న విషయం తెలిసిందే. అయితే థర్డ్ ఫ్రంట్  ఒకవేళ గెలిస్తే ప్రధానమంత్రి ఎవరు అవుతారు అనే ప్రశ్నకు మాత్రం చాలా పేర్లు సమాధానంగా ఉన్నాయి. ఒకవేళ థర్డ్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే ప్రధానమంత్రి అభ్యర్థులుగా మమత బెనర్జీ,ములాయం సింగ్, శరత్ యాదవ్, దేవేగౌడ, లాలూ ప్రసాద్ యాదవ్, కేజ్రీవాల్ లాంటి పేర్లు ముఖ్యంగా వినిపిస్తూ ఉంటాయి.

 ఇప్పుడు తాజాగా మరో ప్రధాన మంత్రి అభ్యర్థి పేరు తెర మీదికి రావడం హాట్ టాపిక్ గా మారిపోయింది.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే మరో మంత్రి అభ్యర్థి అనే టాక్ వినిపిస్తోంది. అంటే అచ్చం ప్రస్తుతం చంద్రబాబు కేసీఆర్ లాగానే తండ్రులు కేంద్ర రాజకీయాల్లోకి వెళితే కొడుకులు సీఎం అవ్వాలి అనే ఉద్దేశంతోనే ఉద్ధవ్ థాకరే కూడా ముందుకు సాగుతున్నారు అనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయాన్ని ఎవరో చెప్పలేదు ఏకంగా ఉద్ధవ్ థాక్రే  పార్టీ  ఎంపీ తృతీయ ఫ్రంట్ అధికారంలోకి వస్తే తమ అభ్యర్థి ప్రధాని అభ్యర్థి అంటూ చెప్పటం హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: