ఏపీ ప్రభుత్వానికి.. సినీ గండం తప్పదేమో..!

Chandrasekhar Reddy
ఆంధ్రప్రదేశ్ లో అన్ని వ్యవస్థలకు రాజకీయ చీడ పట్టుకుంది అనిపిస్తుంది. అసలు సినీ ప్రపంచం లేకుండా కేవలం థియేటర్లు మాత్రమే ఉన్న రాష్ట్రంలో కూడా ఆ పరిశ్రమకు తిప్పలు తప్పడం లేదు. కేవలం ఆదాయం కోసమో లేదా వ్యవస్థలో ఉన్న లోపాలను సరిచేయడానికో సంస్కరణలు చేపడితే సరి, కానీ మరో ఉద్దేశ్యం ఉంటె అది ఖచ్చితంగా భవిష్యత్తులో  బూమరాంగ్ మాదిరి మరో సమస్యగా తిరిగి వచ్చే అవకాశం ఎంతైనా ఉంటుంది. అవన్నీ తెలిసి కూడా ఏపీలో సినిమా వ్యవస్థ పై ఆన్ లైన్ విధానం ప్రారంభించారు. ఇప్పటికే దీనిపై అన్ని వ్యవహారాలు పూర్తి చేయబడినప్పటికీ, కేవలం కొందరు సినీ జనాలు మాత్రమే ఇందుకు సుముఖంగా ఉన్నారు.
సినీ పరిశ్రమలో కూడా లోపాలు ఉండొచ్చు, వాటిని సరిదిద్దటానికి ఆ వ్యవస్థ పూనుకుంటే ఒకరకంగా ఉంటుంది. అలా కావడం లేదు అన్న పక్షంలో వేరే మార్గాలు వెతుక్కోవడం తప్పేమి కాదు. అలా ఒక ప్రభుత్వం దగ్గరకు కొందరు సినీ ప్రముఖులు వెళ్లడం, ఆన్ లైన్ పై వినతులు ఇవ్వడం జరిగి ఉండొచ్చు. ఇక్కడ ఎప్పటి నుండో పరిశ్రమలు పేరుకుపోయిన సమస్యల పరిష్కారం కోసం కొందరు ఎదురు చూస్తున్నారు. వీరందరికి ప్రభుత్వమే ఏదైనా చేస్తుందేమో అని ఆలోచించి వారిని కలిసి ఉండొచ్చు, లేదా వీళ్లే ఒక ఆలోచన చేసుకొని, మాకు ఇలాంటి ఒక పద్దతిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరవచ్చు.
సినిమా వాళ్ళు ప్రభుత్వం దగ్గరకు ఒక ముందస్తు ఆలోచనతో వచ్చి ఉంటె, ప్రభుత్వం వాళ్ళ కోరికను మన్నిస్తూ, తమకు కావాల్సిన పని చేసి పెడుతుంది. ఇది ప్రభుత్వం బాధ్యత. అలా కాకుండా సినీ పరిశ్రమలో పలానా లోపాలు ఉన్నాయి, మేము సర్దుతాము అని ప్రభుత్వం జోక్యం చేసుకుంటే మాత్రం అది కాస్త వేరే వ్యవహారం అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ కొందరు నిర్మాతలు తమకు నష్టాలు వస్తున్నాయనో లేదా సినిమా థియేటర్ల యాజమాన్యాలు తమకు నష్టాలు వస్తున్నాయనో మొరపెట్టుకుంటేనో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం సమంజసమే. కానీ అది సినీ పరిశ్రమలో పెద్దలను కూర్చుపొట్టి మాట్లాడటం ద్వారా ఒక నిర్ణయానికి వస్తేనే మంచి పరిణామంగా మారుతుంది. అందరికి మేలు చేసే మార్గం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: