ముద్ర‌గ‌డ రీ ఎంట్రీకి ముహూర్తం రెడీనా..!

VUYYURU SUBHASH
కాపు ఉద్యమం ద్వారా మరుగున పడిపోయిన మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం ఒక్కసారిగా తెరమీదకు వచ్చారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొంతకాలంగా సైలెంట్ అయ్యారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ముద్ర‌గ‌డ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల కాలంలో ఆయన వివిధ సమస్యలపై లేఖ‌లు రాస్తూ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముద్ర‌గ‌డ‌ పద్మనాభం దశాబ్దాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతున్నారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కాపు రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించి కాపు సామాజికవర్గం ప్రయోజనాల కోసం పోరాడారు. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాపుల్లో ఐక్యత తీసుకువచ్చి గత ఎన్నికల్లో కాపులు అందరూ కూడా బాబుకు వ్యతిరేకంగా ప్రభావితం చేయటంలో చాలా వరకూ సక్సెస్ అయ్యారు. పైగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనకు ... తన కుటుంబానికి ఘోరమైన అవమానం జరిగిందని కూడా ప్రజల్లోకి తీసుకు వెళ్ళారు.

ఇవన్నీ కూడా కాపు సామాజిక వర్గం ప్రభావితం కావడానికి కొంతవరకు దోహదపడ్డాయి. అయితే ఆరు నెలల క్రితం ఆయన కాపు రిజర్వేషన్ పోరాటం నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ఎందుకు మాట్లాడటం లేదని విమర్శలు కూడా వచ్చాయి.  అయితే ఇటీవల కాలంలో ముద్రగడ మళ్లీ యాక్టివ్ అయ్యారు.

ప‌లు సమస్యలపై ముఖ్యమంత్రికి లేఖలు రాస్తూ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఇటీవల భువ‌నేశ్వ‌రి విషయంలో చంద్రబాబు కు నాడు తనకు జ‌రిగిన అవ‌మానం గుర్తు చేస్తూ లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించడం త‌ప్పు అని నేరుగా ప్రధానమంత్రి మోడీ కి లేఖ రాశారు. ఇక వచ్చే ఎన్నికలకు ముందు ఆయన పొలిటికల్ రీ ఎంట్రీ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మ‌రి ముద్రగడ ఏ పార్టీలో చేరుతారు అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: