తాలిబ‌న్ అరాచ‌కం : వేటాడి, వెంటాడి చంపేస్తున్నారు..!

Paloji Vinay
ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌ణికిస్తున్న ప‌దం తాలిబ‌న్. అఫ్ఘ‌నిస్తాన్‌ను ఆక్ర‌మించుకున్న‌ తాలిబ‌న్ లు అరాచ‌క పాల‌న‌ను కొన‌సాగిస్తూనే ఉన్నారు. తాజాగా ప్ర‌భుత్వం హ‌యాంలో నిఘావిభాగాల్లో ప‌ని చేసిన అధికారుల‌ను కిడ్నాప్ చేస్తున్నారు. దొర‌క‌ని వారిని వేటాడి, వెంటాడి మ‌రీ హ‌త్యలు చేస్తున్నారు. అఫ్ఘ‌నిస్తాన్ నుంచి అమెరికా వైదొలిగ‌న త‌రువాత‌.. కీల‌క భూభాగాల‌ను స్వాధీనం చేసుకున్నారు తాలిబ‌న్‌లు. ఈ క్ర‌మంలో విస్తూపోయే అంశాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఓ వైపు అఫ్ఘ‌న్ సైన్యంపై తాలిబ‌న్ ఉగ్ర‌వాదులు దాడి కొన‌సాగిస్తూనే మ‌రోవైపు దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.
 
 తాలిబ‌న్ పాల‌న‌తో అఫ్ఘ‌నిస్తాన్‌లో ఆట‌విక రాజ్యం మొద‌ల‌యింది. క‌ఠిన ష‌రియ చ‌ట్టాల అమ‌లు చేస్తూ మ‌హిళ‌ల నుంచి పిల్ల‌ల వ‌ర‌కు అనే నియ‌మ, నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేస్తున్నారు. దీంతో ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు వ‌చ్చేందుకే బ‌య‌ప‌డుతున్నారు. అఫ్ఘ‌నిస్తాన్ ఆక‌లి మంట‌ల‌తో అల‌మ‌టిస్తున్న తాలిబ‌న్‌లు మాత్రం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు. ఇటీవ‌లే అఫ్ఘ‌న్‌ను త‌మ గుప్పిట్లోకి తీసుకున్న తాలిబ‌న్‌లు  మంచి పాల‌న అందిస్తామ‌ని చెప్పినా అది నిజం కాద‌ని తేలిపోయింది. ప‌గ‌, ప్ర‌తికారాల‌తో రెచ్చిపోతున్నారు.

 ప్ర‌ధానంగా మహిళ‌ల‌పై ఉక్కుపాదం మోపుతున్నారు. వారి వ‌స్త్రధార‌ణ‌పై కూడా క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే గ‌త ప్ర‌భుత్వం హ‌యంలో ప‌ని చేసి అధికారులపై ప‌గ‌బ‌ట్టి కిడ్నాప్ చేస్తున్నారు. దొర‌క‌ని వారిని క్రూరంగా చంపేస్తున్నారు.  ఈ విష‌యాన్ని హ్యూమ‌న్ రైట్స్ వాచ్ నివేదిక వెల్ల‌డించ‌డంతో స‌ర్వ‌త్రా ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. నాలుగు ప్రావిన్స్‌లో సుమారు వంద మందికి పైగా క‌నిపించ‌డం లేద‌ని వీరిని హత్య చేసి ఉంటార‌నే అనుమానాలు వ్య‌క్తం చేసింది.


తాలిబ‌న్ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన త‌రువాత గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలోని ఉద్యోగుల‌ను క్ష‌మించామ‌ని ప్ర‌క‌టించారు. కానీ, దానికి  విరుద్ధంగా వారిపై క‌క్ష గ‌ట్టి ప్ర‌తికారం తీర్చుకుంటున్నారు. ఆగ‌స్టు 15 నుంచి అక్టోబ‌ర్ 31 వ‌ర‌కు  నాలుగు ప్రావిన్స్‌ల్లో 47 మంది మాజీ సైనికులు మ‌రో 53 మంది మాజీ ఉద్యోగులు అప‌హ‌ర‌ణ‌కు గుర‌యిన‌ట్టు మాన‌వ హ‌క్కుల సంస్థ వెల్ల‌డిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: