కాటసాని-శిల్పా-ఎల్లారెడ్డి ఫ్యామిలీల కాంబోకు తిరుగులేనట్లేనా?

M N Amaleswara rao
ఏపీలో ఫ్యామిలీ పాలిటిక్స్ ఎక్కువే అని చెప్పొచ్చు...ఒకే ఫ్యామిలీ నుంచి పలువురు నేతలు రాజకీయం చేస్తున్నవారు ఉన్నారు. అలా కర్నూలు జిల్లాలో పలు ఫ్యామిలీలు రాజకీయం చేస్తున్నాయి. అధికార వైసీపీలో కావొచ్చు..ప్రతిపక్ష టీడీపీలో కావొచ్చు..ఒకే ఫ్యామిలీకి చెందిన లీడర్లు రాజకీయం చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీలో ఈ ఫ్యామిలీ కాంబో పెద్దగానే ఉంది.


అసలు ఎమ్మెల్యేలుగానే ఒకే ఫ్యామిలీకి చెందిన వారు ఉన్నారు. పైగా వారు రాజకీయంగా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. జిల్లాలో కాటసాని, శిల్పా, ఎల్లారెడ్డి  ఫ్యామిలీల నుంచి ఎమ్మెల్యేలు ఉన్నారు. బనగానపల్లెలో ఎమ్మెల్యేగా కాటసాని రామిరెడ్డి ఉంటే, పాణ్యంలో ఎమ్మెల్యేగా కాటసాని రామ్ భూపాల్ రెడ్డి ఉన్నారు. ఈ ఇద్దరు నేతలు బంధువులు అనే సంగతి తెలిసిందే. పైగా ఇద్దరు నేతలు రాజకీయంగా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. అయితే ఇందులో భూపాల్ రెడ్డి ఇంకా స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఈయన నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఈజీగా గెలిచేసేలా ఉన్నారు.
ఇటు శిల్పా ఫ్యామిలీ విషయానికొస్తే శిల్పా చక్రపాణిరెడ్డి, శిల్పా మోహన్ రెడ్డిలు సోదరులు అనే విషయం తెలిసిందే. ఒకప్పుడు వీరు టీడీపీలో కీలకంగా పనిచేశారు. తర్వాత వైసీపీలోకి వచ్చేశారు. ఇప్పుడు శ్రీశైలం ఎమ్మెల్యేగా శిల్పా చక్రపాణిరెడ్డి ఉండగా, నంద్యాల ఎమ్మెల్యేగా మోహన్ రెడ్డి తనయుడు శిల్పా రవికిషోర్ రెడ్డి ఉన్నారు. ఈ ఇద్దరు నేతలు కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. మళ్ళీ వీరు గెలవడం ఈజీ అని తెలుస్తోంది.


అటు ఎల్లారెడ్డి ఫ్యామిలీ విషయానికొస్తే ముగ్గురు అన్నదమ్ములు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయితే ఇద్దరు కర్నూలు జిల్లాలో ఉండగా, ఒకరు అనంతపురం జిల్లాలో ఉన్నారు. కర్నూలు జిల్లాలోని మంత్రాలయం ఎమ్మెల్యేగా వై. బాలనాగిరెడ్డి ఉండగా, ఆదోని ఎమ్మెల్యేగా వై. సాయిప్రసాద్ రెడ్డి ఉన్నారు. ఇక అనంతలోని గుంతకల్ ఎమ్మెల్యేగా వై. వెంకట్రామి రెడ్డి ఉన్నారు. రాజకీయంగా ఈ ముగ్గురు అన్నదమ్ములు కూడా బలంగానే ఉన్నారు. మొత్తానికి ఈ ఫ్యామిలీ కాంబోలు వైసీపీకి ప్లస్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: