పాక్ లో.. కాల్పుల హడావుడి..!

Chandrasekhar Reddy
పాకిస్తాన్ లో చైనా ఆధిపత్యం ఎక్కువ అవుతుంది. అప్పు ఇచ్చి, ఆయా ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటుంది. సైన్యం మాత్రం చూస్తూ ఉంటుంది, నేతలకు ఎటువంటి చొరవ ఉండదు. ఇలా అక్కడ పరిస్థితి అస్తవ్యస్తంగా అయిపోయింది. దీనితో ప్రజలలో తిరుగుబాటు వచ్చే కొద్దీ ఎక్కువ అవుతుంది. ఒక స్థాయిలో ఆస్తులను తగలబెట్టి తమ నిరసనలను వెళ్లబుచ్చుతున్నారు. అలాగే కనీసం పాక్ సైన్యం కనపడినా చితక్కొడుతున్నారు, వాళ్ళు కూడా కాల్పులకు దిగుతున్నారు. ఇది అక్కడ రోజువారీ దినచర్యగా మారిపోయింది. చేసేది లేక ఎప్పటిలాగానే భారత్ వైపు చూస్తూ, విమర్శలకు సిద్ధం అవుతున్నారు. ఇవన్నీ జరుగుతున్నా కూడా ప్రధాని ఇమ్రాన్ మాత్రం పదవి కోసమే ప్రాకులాడుతూ తమ దేశంలో  పరిస్థితులు గొప్పగా ఉన్నాయని చెప్పుకు తిరుగుతున్నాడు.

స్వాతంత్రం ఇచ్చే ముందు బ్రిటిష్ వాళ్ళు రగిలించిన చిచ్చు పాక్, భారత్ శత్రుత్వం. ఇప్పటికి అది రగిలిపోతూనే ఉంది. భారత్ అనుక్షణం వెనక్కి తగ్గి ప్రవర్తిస్తూనే ఉన్నప్పటికీ, పాక్ మాత్రం అది చేతగాని తనంగా భవిస్తూ, ఇష్టానికి తెగబడుతూనే ఉంది. అందుకే ఇంకా ఈ చిచ్చు రగులుతూనే ఉంది. పాక్ లో అనేక సంక్షోభాలు తెలితినప్పటికీ, అక్కడ జీవన ప్రమాణాలు రోజురోజుకు దిగజారుతూనే ఉన్నప్పటికీ, ఆ దేశం తన తీరును మార్చుకోవడం లేదు, మార్చుకోదు కూడా అని ప్రస్తుత పరిస్థితులు చుస్తే అర్ధం అవుతుంది. కేవలం భారత్ ను దెబ్బతీయడానికి తీవ్రవాదులను దగ్గరకు చేర్చుకుంది.
అప్పటి నుండి కాస్త కాస్త ఉగ్రభూతాలు దానిని నాశనం చేస్తూనే ఉన్నారు. ఒకస్థాయిలో వాళ్లపై కూడా నమ్మకం పోయిందేమో, చైనాతో జతకట్టింది. అంతే, ప్రస్తుతం చైనా కోరలలో చిక్కుకొని అల్లాడుతూనే ఉంది. చైనా స్వార్థం కూడా ఇందులో లేకపోలేదు, పాక్ ను గిల్లితే భారత్ కు నొప్పి కలుగుతుంది అనేది దాని ఆలోచన. అది నిజమే కావచ్చు, ఒకప్పుడు. ఇప్పటి పరిస్థితులలో ఆ అవకాశం లేదని తేలిపోవడంతో ఇక పాక్ ను పక్కన తిప్పుకోవడం వృధా అనుకోని కొద్దికొద్దిగా ఆ దేశాన్ని ఆక్రమిస్తూ, అప్పు కింద జమ అంటుంది. అయితే ఇక్కడ తీవ్రవాద తాలిబన్ లు కూడా పాక్ ను మరోవైపు నుండి ఆక్రమించుకుంటూనే ఉన్నారు. ఇవన్నీ సహించలేని ప్రజలు కనీసం నిరసనలు తెలియజేస్తూ వాళ్ళ గోడు ప్రపంచానికి తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: