రాప్తాడులో తోపుదుర్తితో శ్రీరామ్‌కు టఫ్ఫేనా!

M N Amaleswara rao
నెక్స్ట్ ఎన్నికల్లో పరిటాల వారసుడు శ్రీరామ్ తొలి విజయం అందుకోగలరా? రాప్తాడులో మరొకసారి టీడీపీ జెండా ఎగరవేయగలరా? అంటే ప్రస్తుతం రాప్తాడులో ఉన్న రాజకీయ పరిస్తితులని చూసుకుంటే...పరిటాలకు పూర్తిగా అనుకూలంగా మాత్రం ఉన్నట్లు కనిపించడం లేదు. మామూలుగా రాప్తాడు అంటే పరిటాల ఫ్యామిలీ కంచుకోటే. కానీ 2019 ఎన్నికల్లో ఆ కంచుకోటని వైసీపీ బద్దలుగొట్టింది. యువ నేత తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి...పరిటాల కోటలో వైసీపీ జెండా ఎగరవేశారు.
అలా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తోపుదుర్తి రాప్తాడులో కాస్త దూకుడుగానే పనిచేస్తున్నారు. ఈ రెండున్నర ఏళ్లలో కాస్త రాప్తాడులో పరిస్తితులని పరిశీలిస్తే...రాజకీయంగా పరిటాల ఫ్యామిలీ పుంజుకున్నట్లే కనిపిస్తోంది. అలా అని తోపుదుర్తి బలం పూర్తిగా తగ్గలేదు. కాకపోతే 2019 ఎన్నికల్లో పరిస్తితి మాత్రం రాప్తాడులో ఇప్పుడు లేదు. కానీ తోపుదుర్తికి పూర్తిగా పట్టు తగ్గలేదు.
ఆయనకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చాలా వరకు ప్లస్ అవుతున్నాయి. అలాగే తోపుదుర్తి జనాలకు దగ్గరగానే ఉంటున్నారు. ఏదో ఎమ్మెల్యేగా గెలిచేశాం ఇంకా ఎందుకులే అన్నట్లు కాకుండా...ప్రజల్లోనే తిరుగుతున్నారు. వారి సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. అంటే ఇలా చేయడం వల్ల ప్రజల్లో తోపుదుర్తిపై పెద్దగా వ్యతిరేకత మాత్రం రాలేదు. పైగా స్థానిక ఎన్నికల్లో కూడా తోపుదుర్తి వైసీపీని బాగానే గెలిపించుకున్నారు. ఇక్కడ టీడీపీ పెద్దగా పోటీ ఇవ్వలేకపోయింది.

 
అయితే ఈ రెండున్నర ఏళ్లలో రాప్తాడులో అనుకున్న మేర అభివృద్ధి జరగకపోవడం తోపుదుర్తికి మైనస్ అవుతుంది. అదే సమయంలో పరిటాల ఫ్యామిలీని తక్కువ అంచనా వేస్తే మాత్రం కాస్త ఇబ్బంది పడే పరిస్తితి ఉంటుంది. ఎప్పటికప్పుడు పరిటాల ఫ్యామిలీకి చెక్ పెట్టేలా తోపుదుర్తి వ్యూహాలు ఉండాలి. అలా లేకపోతే తోపుదుర్తికి నెక్స్ట్ ఎన్నికల్లో గెలవడం ఈజీ కాదు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో అయితే తోపుదుర్తి కాస్త స్ట్రాంగ్‌గానే ఉన్నారు. అంటే ఇక్కడ పరిటాల ఫ్యామిలీ ఇంకా కష్టపడాల్సిన అవసరముంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: