కమ్మూనిస్టు ప్రభుత్వంలో.. వాళ్లకు ట్రాకింగ్ ఆంక్షలు..!

Chandrasekhar Reddy
అతిపెద్ద కమ్యూనిస్ట్ దేశం లో అన్ని అన్యాయాలే జరుగుతున్నప్పటికీ, కమ్యూనిస్ట్ సమాజం మౌనంగానే ఉంటుంది అదేమిటో! కమ్యూనిస్ట్ లు అంటేనే స్వేచ్ఛ, హక్కుల గురించి మాట్లాడతారు, అలాంటిది ఒక దేశం తమది కమ్యూనిస్ట్ ప్రభుత్వం అని చెప్పుకుంటూ కూడా కనీస హక్కులను తమ పౌరులకు కల్పించకుండా ఉండటం ఎంతవరకు న్యాయం అనేది ఇక్కడ ప్రశ్న. అయితే దానిని ఆ ప్రశ్న వేసే ధైర్యం ఏ కమ్యూనిస్టుకు ఉండబోదు అనుకుంటా. ఎవరైనా అలాంటి ప్రశ్న వేస్తే వాళ్ళను కూడా మాయం చేసినా చేసేస్తుంది చైనా. ఇప్పటికే అలా తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అనేక మందిని కనిపించకుండా మాయం చేసేసింది. ఇలాంటి పనులకు పెట్టింది పేరుగా మారినా చైనాను అతిపెద్ద కమ్యూనిస్ట్ ప్రభుత్వంగా గుర్తిస్తున్న అంతర్జాతీయ సమాజాన్ని తప్పుబట్టాలి తప్ప ఆ దేశాన్ని ఏమి అనలేము.
అధ్యక్షుడు జిన్ పింగ్ ఎప్పుడు కొత్తకొత్త చట్టాలు తెస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు. తాజాగా కూడా అలాంటి చట్టం ఒకటి తెస్తున్నాడు. ఇకమీదట చైనా జర్నలిస్టులు కావచ్చు, విదేశీ విద్యార్థులు కావచ్చు చైనా లో ఉండాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ కు ట్రాకింగ్ డివైజ్ అమరుస్తారట. అది లేకుండా ఎవరైనా ఉంటె ఖైదు చేయడమేనట. అది అతిపెద్ద ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పరిస్థితి. సాధారణంగా ఏదైనా నేరస్తులకు ఇలాంటివి అమర్చి వాళ్ళు పారిపోకుండా చూస్తారు. కానీ చైనాలో జర్నలిస్టులు, విదేశాల నుండి చైనాకు వచ్చి చదువుకునే వారు, ఉద్యోగస్తులు అందరు ఇక ట్రాకింగ్ డివైజ్ తగిలించుకోవాల్సిందే.
బహుశా వీళ్లంతా తమ గుట్టును బయట పెడతారేమో అని జిన్ బయపడి ఇలాంటి ఆలోచన చేసి ఉండొచ్చు. అంతేకదా మరి, ఆ దేశంలో జిన్ ఏది చెపితే అది ప్రచురించాలి, మీడియా లో అదే వార్త రావాలి. అదనంగా ఏదైనా వేస్తె అంతే. అది అక్కడ జర్నలిస్టులకు ఉన్న స్వేచ్ఛ. తాజాగా కొన్ని వార్తలు ఇతర సామజిక మాధ్యమాల ద్వారా కూడా లీక్ అవుతుండటంతో ఇలాంటి నియమం తీస్తున్నాడు జిన్ గారు. సామజిక మాధ్యమాలలో కూడా జిన్ గారు చెప్పిందే రావాలట, మరొకటి వస్తే, వాళ్ళందరూ మాయం అయిపోవాల్సి వస్తుంది మరి. విద్యార్థులు చైనా కు చదుకోవడానికి వెళ్లే అవకాశాలు తగ్గిపోతాయా లేదా అనేది చూడాలి. లేకపోతే దొంగల మాదిరి ట్రాకింగ్ డివైజ్ పెట్టుకొని మరి చైనా వెళ్లి చదువుకునే ఖర్మ ఎవరు అనుభవిస్తారు, ఎవరి ఇష్టం వారిది అనుకోండి, చూద్దాం ఏమి జరగనుంది అని.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: