తూర్పులో టీడీపీకి ఆ సీట్లు డౌటే?

M N Amaleswara rao
తూర్పు గోదావరి జిల్లా...ఏపీ రాజకీయాలని శాసించే జిల్లా. ఈ జిల్లాలో ఆధిక్యం తెచ్చుకుంటే చాలు..రాష్ట్రంలో కూడా ఆధిక్యం దక్కించుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది. అందుకే రాజకీయ పార్టీలు ఈ జిల్లాపైనే ఎక్కువ ఫోకస్ చేసి రాజకీయం చేస్తూ ఉంటాయి. ఇక్కడ మెజారిటీ నియోజకవర్గాలని కైవసం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాయి. 2014 ఎన్నికల్లో ఈ జిల్లాలో టీడీపీ ఆధిక్యం సాధించగా, 2019 ఎన్నికల్లో వైసీపీ ఆధిక్యం సాధించింది. ఇక 2024 ఎన్నికల్లో ఆధిక్యం దక్కించుకోవడానికి..రెండు పార్టీలు ఇప్పటినుంచే పోటీ పడుతున్నాయి. మధ్యలో సత్తా చాటాడానికి జనసేన కూడా ప్రయత్నిస్తుంది.
అయితే వచ్చే ఎన్నికల్లో గెలవడం టీడీపీకి చాలా కీలకం. ఆ పార్టీ భవిష్యత్‌కు ముఖ్యమైన ఎన్నికలు. అందుకే ఆ పార్టీ చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళాల్సిన అవసరముంది. ఈ క్రమంలోనే తూర్పులో మెజారిటీ సీట్లు దక్కించుకోవడానికి టీడీపీ ప్రయత్నిస్తుంది. ఈ రెండున్నర ఏళ్లలో జిల్లాలో చాలా వరకు టీడీపీ పట్టు బిగించిందనే చెప్పాలి. 2019 ఎన్నికల్లో ఉన్న పరిస్తితిని ఇప్పుడు చాలావరకు మార్చుకుంది.
కానీ ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ పికప్ అవ్వాల్సి ఉంది. పలు నియోజకవర్గాల్లో టీడీపీ ఇంకా పుంజుకోలేదు. అలా టీడీపీకి డౌట్ ఉన్న సీట్లు వచ్చి..తుని, రామచంద్రాపురం, జగ్గంపేట, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, రాజోలు సీట్లు ఉన్నాయని చెప్పొచ్చు. ఈ సీట్లలో టీడీపీ ఇంకా పికప్ అవ్వాల్సి ఉంది. పైగా ఇప్పుడు టీడీపీ చేతుల్లో ఉన్న పెద్దాపురం, మండపేట నియోజకవర్గాల్లో వైసీపీ పుంజుకుంటుంది. దీని బట్టి చూస్తే తూర్పులో టీడీపీకి చాలా సీట్లు డౌటే అన్నట్లు పరిస్తితి ఉంది.
అయితే ఇక్కడ జనసేనకు కూడా మంచి బలమే ఉంది. కానీ ఆ పార్టీకి సొంతంగా గెలిచే బలం మాత్రం కనబడటం లేదు. అదే సమయంలో టీడీపీతో గానీ జనసేన జత కడితే...ఇంకా ఎలాంటి డౌట్ ఉండదనే చెప్పాలి. జిల్లాలో ఎలాంటి డౌట్ లేకుండా మెజారిటీ సీట్లు టీడీపీ ఖాతాలో పడతాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: