ఇరాన్ : రైతులకు తప్పని.. ఉద్యమాలు..!

Chandrasekhar Reddy
రైతులు ఎక్కడ ఉన్నా నిర్లక్ష్యానికి గురవుతున్నట్టుగా ఉన్నారు. అందుకే ప్రతి దేశంలో ఏదో ఒక సమస్యపై ఉద్యమించాల్సి వస్తుంది. ఇతర దేశాలలో వీళ్ళను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తారో చేయరో కానీ, వాళ్లకు సమస్యలు మాత్రం తప్పడం లేదు. అమెరికా లాంటి దేశాలలో కూడా గ్రామీణ ప్రాంతాలలో జరిగే రైతుల ఉత్పత్తి విలువ ఆ దేశాన్ని గొప్పగా నిలబెడుతుంది. అంటే వారి పాత్ర ఆ స్థాయిలో ఉంటుంది. ప్రతి చోట పాత్ర అదే కావచ్చు, కానీ వాళ్ళ సమస్యలను తీర్చే విధానాలు వేరుగా ఉంటున్నాయి. అందుకే చాలా చోట్ల రైతు రాజుగా ఉన్నాడు, మరి కొన్ని చోట్ల ఆయనే బిచ్చగాడిలా ఉండిపోయాడు. ఎన్ని దెబ్బలు తగిలినా తన వృత్తిని మాత్రం వదలకుండా చేసుకుంటూ పోవడం వారి గొప్పతనం. ఇతరులు వదిలేసినట్టుగా రైతు కూడా తన పనిని వదిలేసి, పట్నాలలో ఏదో ఒక పని చేసుకుని పొట్టపోసుకుందాం అనుకుంటే, అది ఆయా దేశాలకు తీరని నష్టాన్నే మిగులుస్తుంది.
మనిషి ఉన్నంత కాలం రైతుకు అన్యాయం జరగకుండా ఉండాల్సిందే. ఎప్పుడు రైతు నిర్లక్ష్యం చేయబడతాడో అప్పుడు ఆహార కొరత తప్పదు. అలాంటి పరిస్థితులలో తినేవారు ఎక్కువ, లభ్యత తగ్గిపోతూ ఉంటుంది. అంటే డిమాండ్ కు తగ్గట్టుగా మార్కెట్లతో సరుకు ఉండదు. దానితో ధరలు ఆకాశానికి పోతుంటాయి. సామాన్యుల బ్రతుకు దుర్భరం అయిపోగలదు. ఇది నేరాలకు తావిస్తుంది. ఏమి లేకపోయినా బ్రతికేయొచ్చుగాక, అన్నం లేకపోతే ఆకలి ఖచ్చితంగా నేరం చేయిస్తుంది. నేరాలు పెరుగుతున్నాయి అంటే, ఆహార కొరత వచ్చేసిందనే గ్రహించాలి. ఇక నేరాలకు పాల్పడటానికి సిద్దమైన వారిని తమవైపు తిప్పుకోవడానికే కొన్ని భూతాలు సిద్ధంగా ఉన్నమాట కూడా వాస్తవం. అలాంటి వారి చేతిలో ఆయుధాలుగా మారి మళ్ళీ సమాజానికి చీడగా తయారవుతారు. ధర్మగ్రంధాలలో కూడా చెప్పబడింది, ఆహారం లేని వారు ఏ నేరం చేసైనా దానిని సాధించుకోవచ్చని, అంటే ఆహారం కోసం హత్య చేసినా అది తప్పుకాదని చెప్పబడింది.
ఇరాన్ లో పరిస్థితి కాస్త వింతగా ఉంది. సాంకేతికత వెంట పడిన ప్రపంచం వనరులను కాపాడుకునే దానిపై శ్రద్ద పెట్టలేకపోయింది. దీనితో రోజురోజుకు పీల్చే గాలి, తాగే నీరు, ఉంటున్న వాతావరణం అన్ని కలుషితం అయిపోతున్నాయి. అవసరాలకు పనికిరాకుండా పోతున్నాయి. ఇప్పటికే ఆయా దేశాలలో ఆక్సిజన్ కూడా కొనుక్కునే స్థితికి వచ్చేశాయి. అలాంటి పరిస్థితులలో ఇరాన్ లో రైతులకు నీటి అవసరాలు తీర్చే కాలువ ఎండిపోయిందని, మళ్ళీ మాకు నీళ్ల ఏర్పాటు చేయాలని ఆ కాలువలోనే రైతులు ఉద్యమానికి దిగారు. దీనితో ప్రభుత్వం వారిని అక్కడ నుండి పంపేసింది. ప్రభుత్వం మాత్రం ఎండిపోయిన చోట నీళ్లను ఎలా తేగలదు. అయితే మరో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది. బహుశా దానిని అడిగితే కానీ చేయరేమో అని, వారి నిరసనను అలా తెలియజేసి ఉండొచ్చు. వారి కోరిక తీరుతుందో లేదో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: