ఏపీ బీపీ : కొత్త పార్టీ కొత్తా దేవుడాండి !

RATNA KISHORE
రాజ‌కీయం ఎలా ఉన్నా రాజ్యాంగ శ‌క్తిగా రాజ‌కీయ శ‌క్తిగా బీసీలు అవ‌త‌రించ‌లేక‌పోతున్నార‌న్న‌ది వాస్త‌వం. అగ్ర‌వ‌ర్ణాలు అన్నీ బ‌లహీన వ‌ర్గాల కోసం ప‌నిచేయ‌డం లేద‌న్న వాద‌న ఒక‌టి బ‌లీయంగా వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర రాజ‌కీయాల్లో కొత్త పార్టీ ఆవ‌శ్య‌క‌త‌ను చాటి చెబుతూ ఆనంద‌య్య ఓ కొత్త పార్టీకి నాంది ప‌ల‌క‌నున్నారు. తెలుగుదేశం, వైసీపీకి చెందిన నాయ‌కుల్లో కొంద‌రు ఆనంద‌య్య వైపు వెళ్తే త‌ప్ప‌కుండా ఆ పార్టీకి ఓ ఊపు రాయ‌డం ఖాయం.

రెండు మూడు పార్టీలు త‌మ ప్రాప‌కాన్ని బాగానే నిలుపుకుంటున్నాయి. అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ బ‌లంగా ఉంటూ సంబంధిత నాయ‌కులు ఒక‌రిపై ఒక‌రు యుద్ధం చేసుకుంటూనే ఉన్నారు. ఈ క్ర‌మంలో ఎప్ప‌టి నుంచో బీసీల కోస‌మే ఓ పార్టీ వ‌స్తుంద‌న్న వాద‌న ఉంది. అది నిజ‌మ‌యి త్వ‌ర‌లో రూపుదాల్చ‌నుంది. నెల్లూరు కేంద్రంగా ప‌నిచేసే ఆనంద‌య్య ఇందుకు సంబంధించిన ప్ర‌య‌త్నం ఒక‌టి చేస్తున్నారు. బీసీలంద‌రికీ రాజ‌కీయ అవ‌కాశాలు ద‌క్క‌డం లేద‌న్న ఆవేద‌న నుంచి ఆయ‌న రాజ‌కీయ పార్టీ ఆవిర్భ‌వించ‌నుంది.
ఏపీలో మ‌రో కొత్త పార్టీ మొద‌లుకానుంది. కరోనా మందు త‌యారీ దారు నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నం ఆయుర్వేద వైద్యుడు ఆనంద య్య కొత్త పార్టీని అనౌన్స్ చేయ‌నున్నారు. బీసీల సంక్షేమ‌మే ధ్యేయంగా ఆయ‌న త‌న పార్టీని మొద‌లు పెట్ట‌నున్నారు. వచ్చే ఎన్ని కల నాటికి ఈ పార్టీ రంగంలోకి రానుంద‌ని తెలుస్తోంది. రాజకీయంగా బీసీల‌ను అన్ని పార్టీలూ విస్మ‌రిస్తున్నాయ‌న్న కార‌ణంతో, స మ న్యాయం, సామాజిక న్యాయం ద‌క్కించాల‌న్న ఉద్దేశంతో ఆనంద‌య్య పార్టీ తెర‌పైకి రానుంది. ఇప్ప‌టి వ‌ర‌కూ బీసీల విష‌య‌మై అన్ని ప్ర‌ధాన  పార్టీలూ అనుస‌రిస్తున్న విధానాలు కాద‌ని, కొత్త‌గా ఓ పార్టీ వ‌స్తుంద‌ని ఆనంద‌య్య అంటున్నారు.

దీంతో అటు టీడీపీ, ఇటు వైసీపీ కూడా అప్ర‌మ‌త్తం కావాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంది. బీసీల కోసం వారి ఐక్య‌త కోసం తాను ప‌నిచేస్తాన‌ని జ‌న‌సేనాని ప్ర‌క‌టించారు. గ‌త ఎన్నిక‌ల్లో కూడా బీసీల‌కు మంచి అవకాశాలే ఇచ్చారు. ఇక అధికారంలో ఉన్న వైసీపీ కూడా బీసీల నామ జ‌ప‌మే చేస్తుంది. టీడీపీ ఎప్ప‌టి నుంచో బ‌హుజ‌నుల  ప‌క్షానే తామున్నామ‌ని వెనుక‌బ‌డిన కులాల, వ‌ర్గాల అభ్యున్నతే ధ్యేయ‌మ‌ని అంటోంది. మ‌రి! ఈ స‌మ‌యంలో కొత్త పార్టీ వ‌చ్చేందుకు ఉన్న అవ‌స‌రం ఏంటి?  దీని వెనుక ఉన్న రాజ‌కీయ శ‌క్తులు ఏంటి?

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: