ప్ర‌ముఖులు తిరుమ‌ల వ‌స్తే.. డాల‌ర్ శేషాద్రి ఉండాల్సిందే..!

N ANJANEYULU
టీటీడీలో పరిచ‌యం లేన‌టువంటి వ్య‌క్తి.  సామాన్య భ‌క్తుడు మొద‌లుకొని వీవీఐపీల వ‌ర‌కు ఎవ‌రికైనా ప‌రిచ‌యం ఉన్న పేరు డాల‌ర్ శేషాద్రి. ఆయ‌న ఉంటేనే అది టీటీడీ కార్య‌క్ర‌మం అనే విధంగా ప్ర‌తీ కార్య‌క్ర‌మంలో పాల్గొనే వారు. ఆయ‌న నిన్న తెల్ల‌వారుజామున  అక‌స్మాత్తుగా గుండెపోటుతో హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు.  మ‌రీ డాల‌ర్ శేషాద్రీ నివాసాన్ని ఒక నివాసం అనే కంటే ఆల‌యం అని కూడా చెప్ప‌డం బెట‌ర్‌.  
నివాసాన్ని డాల‌ర్ శేషాద్రి  శ్రీ‌వారి ఆల‌యం మాదిరిగానే ఏర్పాటు చేసుకున్నారు. శ్రీ‌వారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల స‌మ‌యంలో 16 వాహ‌నాల‌పై వీధుల‌లో ద‌ర్శ‌నం ఇస్తుంటారు.  అలాంటి వాహ‌నాల‌న్నింటిని శేషాద్రి స్వామి నివాసంలో ఏర్పాటు చేసుకున్నారు. వీవీఐపీల‌తో డాల‌ర్ శేషాద్రికి ఎప్ప‌టి నుంచో ఎంతో అనుబంధం క‌లిగి ఉన్న‌ది. 1978లో టీటీడీలో ఉద్యోగంలో చేరిన డాల‌ర్ శేషాద్రి దాదాపు 43 సంవ‌త్స‌రాల పాటు టీటీడీ సేవ‌ల్లోనే కొన‌సాగారు. ఉద్యోగం చేరిన కొత్త‌లో 6 నెల‌ల పాటు తిరుప‌తిలో విధినిర్వ‌హ‌ణ చేసిన శేషాద్రి.. త‌రువాత పూర్తిగా శ్రీ‌వారి స‌న్నిధిలోనే గ‌డిపారు డాల‌ర్‌. 43 సంవ‌త్స‌రాల కాలంలో 11 నెల‌లు కాలం పాటు బ్రేక్ మాత్ర‌మే వ‌చ్చిన‌ది.
2009లో అప్ప‌టి ఈవో కృష్ణారావు తీసుకొచ్చిన నిబంధ‌న కార‌ణంగా స్వామి వారి సేవ నుంచి 11 నెల‌ల కాలం దూరమ‌య్యారు. తిరిగి కోర్టు ఆదేశాల‌తో టీటీడీ సేవ‌లో ఉన్నారు. వెంక‌న్న స‌న్నిధిలో జ‌న్మించిన శేషాద్రి.. అప్ప‌న్న స‌న్నిధిలో ప్రాణాలు విడిచార‌ని చెప్పుకుంటున్నారు. 1978 నుంచి శ్రీ‌వారి ఆల‌యానికి వ‌చ్చిన ప్ర‌తి ప్ర‌ముఖుల‌తో  రాష్ట్రప‌తి నుంచి మొద‌లుకొని ప్ర‌ధాని, కేంద్ర‌మంత్రి, ముఖ్య‌మంత్రి ఇలా ఎవ‌రైనా శేషాద్రితో ఫోటో తీసుకోవాల‌ని ఇష్ట‌ప‌డేవార‌ట‌.
అప్ప‌టి రాష్ట్రప‌తి జ్ఞాని జైల్‌సింగ్‌, ప్ర‌ధానులు పీవీ న‌ర్సింహ‌రావు, వాజ్‌పేయి, మ‌న్మోహ‌న్‌సింగ్‌, న‌రేంద్ర‌మోడీ, తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు చంద్ర‌బాబునాయుడు, వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి, కిర‌ణ్‌కుమార్‌రెడ్డి, వైఎస్ జ‌గ‌న్‌, కేసీఆర్ తో పాటు దేశ‌వ్యాప్తంగా ఉన్న గ‌వ‌ర్న‌ర్లు ఇలా ఎవ‌రూ తిరుమ‌ల‌కు వ‌చ్చినా కానీ డాల‌ర్ శేషాద్రి వారితోనే క‌నిపించేవారు.    
  శేషాద్రి ఓ ఐకాన్‌గా ముద్ర ప‌డిపోయారని.. ఆల‌యంలో ఏవిధమైనా పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని స్వామి వారి సేవ‌ల‌ను ధ‌రిస్తూనే ఉంటార‌ని, అయిన‌ప్ప‌టికీ ఆరోగ్యంపై మాత్రం ఆయ‌న‌కు ధ్యాస లేదు. త‌న ప‌ని త‌న‌ది.. ఆరోగ్యం ప‌ని ఆరోగ్యానిది అని పేర్కొనేవారు. కార్తీక సోమ‌వారం అని పేర్కొన్న రోజు ఆయ‌న మ‌ర‌ణించార‌ని మోక్ష ప్రాప్తి ల‌భించింద‌ని పేర్కొంటున్నారు.  డాల‌ర్ శేషాద్రి నిర్ణ‌యించిన ప్ర‌కారం శ్రీ‌వారి సేవ‌లు జ‌రిగే విధానం  పూర్తిస్థాయిలో ఓ పుస్త‌క రూపంలో వ‌చ్చిన‌ది. అదే ఇప్పుడు టీటీడీ కార్య‌క్ర‌మాలను  ఆ పుస్త‌కం ప్ర‌కార‌మే నిర్వ‌హించ‌నున్నారు.
డాలర్‌ శేషాద్రి అంతిమ సంస్కారాలు ఇవాళ తిరుపతిలో  నిర్వ‌హించ‌నున్నారు.సిరిగిరి అపార్ట్‌మెంట్‌లో భక్తుల సందర్శించేందుకు ఉంచారు.  ఆ త‌రువాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి 3 గంటల వరకు పూజలు నిర్వహించి.. తిరుపతి గోవింద ధామంలో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఇవాళ సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ డాల‌ర్ శేషాద్రిని సంద‌ర్శించ‌డానికి తిరుమ‌ల రానున్నారు. ఆయ‌న పార్థివ‌దేహానికి ఎన్టీ ర‌మ‌ణ నివాళుల‌ర్పించ‌నున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖులు శేషాద్రి పార్థివ దేహానికి నివాళుల‌ర్పించారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు సానుభూతికి వ్య‌క్త ప‌రిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: