ఒమిక్రాన్ ప్రభావంతో సీఎం జగన్ కీలక ఆదేశాలు..!

NAGARJUNA NAKKA
ఆంధ్రప్రదేశ్ లో కొత్త వేరియంట్ కారణంగా వైద్య శాఖతో సమీక్షించిన ముఖ్యమంత్రి జగన్.. అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. వ్యాక్సినేషన్ ను ఉధృతం చేయాలనీ.. డిసెంబర్ నాటికి 2కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. డోర్ టూ డోర్ వ్యాక్సినేషన్, ఫీవర్ సర్వేచేయాలన్నారు. ఆస్పత్రుల్లో వసతులు సరిగా ఉన్నాయో చూసుకోండని వైద్యాధికారులకు సూచించారు. ఆర్టీపీసీఆర్ టెస్ట్ లు మాత్రమే చేయాలనీ.. ర్యాపిడ్ టెస్ట్ లు వద్దని హెచ్చరించారు సీఎం. మాస్క్ గైడ్ లైన్స్ ఎన్ ఫోర్స్ చేయాలన్నారు.
ఒమిక్రాన్ ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోందన్నారు మంత్రి ఆళ్లనాని. ఏపీలో ఒమిక్రాన్ కేసు నమోదు కాలేదన్నారు. కొత్త వేరియంట్ పై సీఎం జగన్ సూచనలు చేసినట్టు చెప్పారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదనీ.. ఒమిక్రాన్ ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. విదేశీ ప్రయాణీకులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరన్నారు. జనవరి 15లోపు వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తి చేస్తామన్నారు. ఆస్పత్రుల్లో అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు.
ఒమిక్రాన్ అయితే మరిన్ని దేశాలకు విస్తరిస్తోంది. హాంకాంగ్, ఐరోపా, ఉత్తర అమెరికాతో పాటు నెదర్లాండ్స్ లో ఈ వేరియంట్ కేసులు గుర్తించారు. ఇక ఇజ్రాయేల్ లోనూ ఈ కేసులు నమోదవుతుండటంతో విదేశాల నుంచి వచ్చే విమానాలను రెండు వారాలు నిలిపివేసింది. అటు జపాన్ కూడా విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. అయితే తమపై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించడంపై దక్షిణాఫ్రికా అసహనం వ్యక్తం చేసింది. కోవిడ్ తో ఇప్పటికే తాము తీవ్రంగా నష్టపోయామంది.
మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ పై ప్రపంచానికి తీవ్ర ముప్పు ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ వేరియంట్ తో కరోనా మరోసారి విజృంభిస్తే తీవ్ర పరిణామాలుంటాయంది. అయితే ఈ వేరియంట్ తో ఇప్పటి వరకు ఒక్క మరణం కూడా నమోదు కానట్టు చెప్పింది. ఇది ఏ స్థాయిలో వ్యాప్తి చెందుతుందో.. తీవ్రత ఎలా ఉంటుందనే విషయాలపై ప్రస్తుతం అనిశ్చితి నెలకొన్నట్టు చెప్పింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.
కరోనా లేదు బిరోనా లేదు అని చాలా మంది మాస్కు పెట్టుకోవడాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పుడు ఒమిక్రాన్ భయపెడుతుండటంతో మాస్కు తప్పనిసరి అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మొక్కుబడిగా కాకుండా నోరు, ముక్కు పూర్తిగా కవర్ అయ్యేలా పెట్టుకోవాలంటున్నారు. అలాగే టీకా వేయించుకున్న వారిలో ఒమిక్రాన్ రాదనేది తప్పుడు ప్రచారమనీ.. రెండు డోసుల టీకా వేసుకున్నా మాస్క్ తప్పనిసరని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: