వేల ఎకరాల గంజాయి ఒక్క దెబ్బకు... ?

Satya
ఏపీ అంతటా ఒక టైమ్ లో ఒకే ఒక్క మాట మీద తిరుగుతూ వచ్చింది. దాని మీద రాజకీయం ఏ రేంజిలో సాగింది అంటే ఏకంగా ముఖ్యమంత్రి మీద టీడీపీ నాయకుడు ఒకరు దారుణంగా నోరు పారేసుకున్నారు. ఫలితంగా ఏపీలో రాజకీయ వేడి అగ్గిలా రాజుకుంది.
ఇక టీడీపీ ప్రధాన కార్యాలయం మీద దాడులు కూడా జరిగాయి. రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధించమని చంద్రబాబు ఢిల్లీ దాకా వెళ్ళిమరీ  రాష్ట్రపతిని కలసి వినతిపత్రం ఇచ్చి వచ్చారు. దీనికంతటికీ మూల కారణం అక్రమ  గంజాయి  రవాణా. ఏపీ నుంచి అక్రమంగా గంజాయి రవాణా అవుతోందని, ప్రభుత్వం అసలు పట్టించుకోలేదని టీడీపీ చేసిన హాట్ హాట్ కామెంట్స్ మొత్తానికి ప్రభుత్వానికి గట్టిగానే తాకాయి.దాంతో ప్రభుత్వం ప్రతిష్టగా చేపట్టిన ఆపరేషన్ పరివర్తన్ విశాఖ జిల్లాలో పెద్ద ఎత్తున సాగింది. ఆంధ్రా ఒడిషా బోర్డర్ లో గంజాయి సాగుని తుదముట్టించేందుకు పోలీసులు స్థానిక ప్రజల సహకారంతో రెడీ అయిపోయారు. దాంతో గత నెల రోజుల వ్యవధిలో ఏకంగా 5,600 ఎకరాల్లో గంజాయి సాగుని ద్వంసం చేశారు.
ఒక్క నెల వ్యవధిలో ఇంత పెద్ద ఎత్తున గంజాయి విద్వంసం అంటే మాటలు అయితే కాదు, ఇది ఇంకా కొనసాగుతోంది. ఎందుకంటే ఏవోబీ పరిధిలో ఏకంగా పాతిక నుంచి ముప్పై వేల ఎకరాల్లో గంజాయి సాగు సాగుతోందని సమాచారం ఉంది. దాంతో మరిన్ని నెలకు పరిశ్రమిస్తే తప్ప గంజాయి విద్వంసానికి ముగింపు ఉండదు, అదే సమయంలో కొత్తగా సాగు చేయకుండా కట్టడి చేయాలి. ఇది నిరంతరమైన ప్రక్రియ. ఏ విధంగా చూసుకున్నా దీన్ని విశాఖ పోలీసులు సాధించిన విజయం గానే చూస్తున్నారు. ఎందుకంటే కొన్నేళ్ళుగా నిరాటంకంగా సాగుతున్న గంజాయి సాగుని ఇంత పెద్ద స్థాయిలో తుదముట్టించడం అన్నది ఎపుడూ జరగలేదు. అక్రమ రవాణా పేరిట అరకొర పట్టివేతలే అన్ని ప్రభుత్వాలూ చేస్తూ వచ్చాయి. అయితే గంజాయి విద్వంసంతో పాటు గిరిజనులలో చైతన్యం కూడా తీసుకువస్తేనే  తప్ప ఈ గంజాయి సాగునకు శాశ్వతంగా తెర పడదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: