కేంద్రం నుండి లాక్కుందాం అని కాదు.. ఉన్నవి దేశానికి ఎలా సర్దుదాం అనేదెప్పుడు..!

Chandrasekhar Reddy
భారతదేశానికి మరోసారి ప్రపంచ పటంలో తనదైన స్థానాన్ని నిరూపించుకునే అవకాశం వచ్చింది. అయితే ఇప్పుడే ఆయా వ్యవస్థల కుట్రలు కూడా భారీగా చోటుచేసుకుంటున్నాయి. ఎదిగేవాడి కళ్ళు పట్టుకులాగే అలవాటు అంతర్జాతీయంగా కూడా ఉండటం సిగ్గుచేటు. అయినా భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తుంది, కానీ ప్రాంతీయంగా కూడా దేశద్రోహులు ఈ అవకాశాన్ని వినియోగించుకోనీయకుండా చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో అది జరిగితే, సుస్థిరంగా అదే ఎక్కువ కాలం ఉంటుందనే ఏడుపు విపక్షాలతో ఉంది అనేది వారి చర్యలతో తెలిసిపోతుంది. కానీ ఇక్కడ వాళ్లకు తెలియాల్సినది మరొకటి ఉంది, ఇలా వాళ్ళు భారత ముందలి కళ్ళకు బందాలు వేస్తూ అడ్డుపడితే, దానిని దేశద్రోహం అంటారు.
అలా అనిపించుకున్నా పరవాలేదు మాకు అధికారమే ముఖ్యం అని అనుకుంటే మీరు ఎంత నీచంగా ఆలోచిస్తున్నది ప్రజలు గమనిస్తే మీ బ్రతుకులు మరోసారి ఓట్లు అడగటానికి వస్తాయా అనేది ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఇదే తరహాలో కేంద్రంపై పడి దొరికినంత తెచ్చేసుకుందాం అనే ఆలోచిస్తున్నారు తప్ప, దేశంలో పరిస్థితులు ఏమిటి, ఎక్కడ ఎక్కడ ఎంత అవసరం ఉంది. మన దగ్గర ఉన్నది సరిపోతుందా, కనీసం కొంత కాలం మనం సర్దుకోగలమా, ఇతరులకు మనకంటే అత్యవసరాలు ఉన్నాయా అని ఆలోచించడం లేదు. ఇలా రాష్ట్రాలు పీడించడానికి కేంద్రం శత్రువేమి కాదు, కనీసం ఆలోచించాల్సిన సమయం ఇది. ఇప్పుడు ఉమ్మడిగా రాష్ట్ర-కేంద్ర ప్రభుత్వాలు మరింత సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. దానిని గురించి చర్చించకుండా, ఎప్పుడెప్పుడు ఎంత లాగేద్దాం, అందులో ఎంత నొక్కేద్దాం అనే ఈ పరిస్థితులలో కూడా ఆలోచిస్తే, రేపటి మీ గతేమిటో కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి.  
ఇప్పటి మీరు తయారు చేసిన ఈ సంస్కారవంతమైన సమాజంలోనే మీ తరువాతి తరాలు కూడా బ్రతకాల్సింది. వాళ్ళేమి మరో ప్రపంచంలో బ్రతకడానికి ఇక్కడ అలాంటివి ఎవరు మిగల్చలేదు అని గుర్తుంచుకొని ప్రవర్తించడం అలవాటు చేసుకోండి. ఒక్కసారి సమాజంలో విషం చిమ్మితే అది మీ తరాలకు కూడా ప్రమాదమే అని జ్ఞాపకం ఉంచుకొని ముందడుగు వేయండి. దేశానికి మంచి అవకాశం వచ్చింది, ఇప్పటి పరిస్థితులలో ఆయా రాష్ట్రాలు అన్ని కూర్చొని తమ వద్ద ఉన్న వనరులు ఏవేవి ప్రస్తుత పరిస్థితులలో చక్కగా ఉపయోగపడతాయి, వీటిని ఎలా ఆయా పరిస్థితులకు అనుగుణంగా వాడాలి, తద్వారా ప్రతి రాష్ట్ర అభివృద్ధి అలాగే దేశ అభివృద్ధి జరుగుతుందని ఆలోచించాల్సిన సందర్భం ఇది. కేంద్ర మీటింగ్ కి వెళితే ఇదే ఆలోచించి, అందరు కలిసి పని చేయడానికి ఎవరు ఏమేమి చేయాలి అనేవి ప్రతి రోజు, వారం, నెల.. ఇలా లక్ష్యాలు పెట్టుకొని ముందుకు అడుగులు వేస్తూ పోవాలి కానీ.. కేంద్రం దగ్గర ఎంత గుంజుదాం, మనకు ఎంత వస్తాది, ఎంత మన జేబులోకి నెట్టుకోవచ్చు లాంటివి కాదు. దయచేసి అవకాశాన్ని సద్వినియోగం చేయండి మహాప్రభో!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: