ఇదే కదా జీవితం : డైలమాలో వైసీపీ సీనియర్లు!

RATNA KISHORE
రాజకీయాలు ఎలా ఉన్నా కూడా ప్ర‌తిరోజూ ఏదో ఒక స‌మ‌స్య‌నో సందేహ‌మో నాయ‌కుల‌ను వెన్నాడుతూనే ఉంటుంది. వైసీపీ నుంచి టీడీపీకి వెళ్లినా, టీడీపీ నుంచి వైసీపీలో చేరిపోయినా ఏం జ‌రిగినా స‌రే ! ఎవ‌రి డైల‌మా వారిది. ఎదిగేందుకు అవ‌కాశం లేని  పార్టీలో తాము ఉన్నా లేకున్నా ఒక్క‌టే అన్న బాధ వైసీపీ నాయ‌కుల‌లో ఇవాళ ఉంది. అందుకే ఒక‌టికి రెండు సార్లు ఆలోచించి పార్టీ మారేందుకు సిద్ధం అవుతున్నారు. పోల్ మేనేజ్మెంట్ కానీ లేదా డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టే విష‌య‌మై కానీ గ‌త ఎన్నిక‌ల్లో మొత్తం జ‌గ‌నే చూసుకున్నార‌ని టాక్. కానీ ఈసారి అలా కాద‌ని కూడా తెలుస్తోంది. అస‌లే అర‌కొర ఆర్థిక వ‌న‌రుల‌తో ఉన్న జ‌గ‌న్ కు ఈ సారి అనుకున్నంతగా నిధులు పార్టీ నేత‌ల నుంచి ఫండ్ రూపంలో దొర‌క‌క‌పోవ‌చ్చు. క‌నుక గ‌తంలో మాదిరి ఎన్నిక‌ల ఖ‌ర్చు జ‌గ‌న్ భ‌రించ‌కుంటే ఓటుకు ఐదు వేలు ఇచ్చి ఎలా కొనగ‌లం అన్న డైల‌మా కూడా ఒక‌టి వెన్నాడుతోంది వైసీపీ సీనియ‌ర్ల‌ను. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల ర‌ణ రంగం నుంచి చాలా మంది త‌ప్పుకునే అవ‌కాశాలే కోకొల్ల‌లు.
ఆంధ్రావ‌నిలో గ‌తంలో క‌న్నా భిన్నంగా ఉన్న పార్టీ నాయ‌కులు, త‌మ‌కు అనుగుణంగా కొన్నినిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఫలితంగా అధినేత‌ల‌కు చుక్కలు చూపిస్తున్నారు. అధికారంలో ఉంటే ఒక‌విధంగా లేన‌ప్పుడు మ‌రో విధంగా వ్య‌వ‌హ‌రిస్తూ రెండు నాల్క‌ల ధోర‌ణిని చాటుతున్నారు. ఈ క్ర‌మంలో టీడీపీ కానీ వైసీపీ కానీ ఎప్ప‌టిక‌ప్పుడు ఏదో ఒక స‌మ‌స్య‌లో ఇరుక్కుపోతున్నా యి. ముఖ్యంగా సీనియ‌ర్లు ఎటు పోవాలో  పాలుపోక ఇంటికే ప‌రిమితం అవుతున్నారు. ఇప్ప‌టికే కొంద‌రు వచ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు సైతం వెనుకంజ వేస్తున్నారు. అప్ప‌టి క‌న్నా ఇప్పుడు రాజ‌కీయం అస్సలు బాలేద‌ని, సీనియ‌ర్ల‌కు గౌర‌వం అన్న‌ది లేద‌ని కొంద‌రు ఆవేద‌న చెందుతున్నారు. ఈ క్ర‌మంలో టీడీపీ నుంచి  కొంద‌రు బ‌య‌ట‌కు వెళ్లిపోయినా ఆశ్చ‌ర్యం లేదు.  వ‌ల‌స‌లు ఎంతో అవ‌స‌రం అయితేనే ప్రోత్స‌హించాల‌ని వైసీపీ అనుకుంటుంది క‌నుక అదంత ఈజీ కాదు.
ఇక ఉత్త‌రాంధ్ర సీనియ‌ర్లు మ‌రోలా ఉన్నారు. గంటా శ్రీ‌ను లాంటి లీడ‌ర్లు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఆయ‌న అనారోగ్య కార‌ణాల‌తో కొంత కాలం రాజ‌కీయాల‌కు ఎడంగానే ఉన్నారు. ఇక వైసీపీ లీడ‌ర్లు అయిన ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు కానీ బొత్స కానీ  వీరు కూడా డైల‌మాలోనే ఉన్నారు. పార్టీలో ఇప్ప‌టిదాకా స‌ముచిత స్థానం ఏమీ లేద‌న్న వాద‌న ఏనాటి నుంచో వినిపిస్తున్నారు.ఈ క్ర‌మంలో రానున్న ఎన్నిక‌లు ఎలా ఉన్నా స‌రే ! జ‌గ‌న్ ద‌గ్గ‌ర త‌మ ఆటలు సాగ‌వ‌న్న విష‌య‌మై ఇప్ప‌టికే ఓ నిర్థార‌ణ‌కు వ‌చ్చేశారు. దీంతో ఇప్ప‌టికిప్పుడు పార్టీ మార‌కపోయినా వచ్చే ఎన్నిక‌ల్లో మాత్రం వైసీపీ కి అనుగుణంగా ప‌నిచేయ‌డం మాత్రం వీరు చేయ‌రు గాక చేయ‌రు అనే తెలుస్తోంది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ద‌గ్గ‌ర క‌నీస మ‌ర్యాద ద‌క్క‌కుంటే ఇంకేం చేయాలి అని వీరంతా వాపోతున్నారు. దీంతో పార్టీలో ఉండాలా వ‌ద్దా అన్న డైల‌మా అయితే వీరిని వేధిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: