ఏపీలో చేస్తోన్న ఈ అప్పులు అన్నీ ఎవ‌రి కోసం...!

VUYYURU SUBHASH
ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు ముసురుకున్నాయి. జ‌గ‌న్ స‌ర్కారు అప్పులు చేస్తోంది. ఇవి తీర్చ‌డం త‌ర్వాత వ‌చ్చే ప్ర‌భుత్వాల వ‌ల్ల‌కాద‌ని.. అంటున్నారు. అంతేకాదు.. మ‌రికొంద‌రు వైసీపీ సొం త నేత‌లే.. దీనికి మ‌రింత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఢిల్లీలో కూర్చుని కామెంట్లు చేస్తున్నారు. ఏపీ ప్ర‌భుత్వం చేస్తున్న అప్పులు ఇప్ప‌ట్లో తీర‌వ‌ని.. ఎవ‌రూ తీర్చ‌లేర‌ని.. ప్ర‌తి ఒక్క‌రిపైనా అప్పులు పెరిగిపోతున్నాయ‌ని.. కామెంట్లు చేస్తున్నారు.వాస్త‌వానికి ప‌రిస్థితి అప్పులు చేస్తున్న‌ట్టు ఉంది.

నిజ‌మే. దీనిని ప్ర‌భుత్వం కూడా కాద‌న‌డం లేదు. ఇదే విష‌యాన్ని ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి కూడా అసెంబ్లీలో ప్ర‌క‌ట‌న చేశారు. అప్పులు చేస్తున్నామ‌ని.. గ‌త ప్ర‌భుత్వం చేసిన అప్పుల‌కు వ‌డ్డీల కిందే చాలా మొత్తం క‌డుతున్నామ‌ని.. ఆయ‌న పేర్కొన్నారు. ఇదిలావుంటే.. ఈ అప్పుల విష‌యంపై ప్ర‌జ‌ల్లోనూ చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌భుత్వాలు అప్పులు చేయ‌డం కొత్త‌కాద‌ని.. మేదావులు కూడా అంటున్నారు.

కేంద్రం కూడా వ్యాక్సిన్ కోసం.. ఏడీబీ(ఏషియ‌న్ డెవ‌ల‌ప్ బ్యాంక్) నుంచి 11 వేల కోట్ల రూపాయ‌లు అప్పులు తీసుకుంద‌ని చెబుతున్న‌రు. అవ‌స‌రానికి అప్పులు చేయ‌డం త‌ప్పుకాద‌ని అంటున్నారు. పైగా అప్పుల‌తోనే ఆవిర్భ‌వించిన రాష్ట్రం ఏపీ కాబ‌ట్టి.. తొలిసారి ఏర్ప‌డిన ప్ర‌భుత్వ‌మే అప్పుల‌ను కంట్రోల్ చేయాల్సి ఉంద‌ని.. కానీ.. అప్ప‌ట్లోనే గాడి త‌ప్పింద‌ని అంటున్నారు.

ఇక‌, ప్ర‌జ‌ల విష‌యానికి వ‌స్తే.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం అప్పులు చేస్తున్న విష‌యాన్ని వారు లైట్ తీసుకుంటు న్నారు. గ‌తంలో ఏ ప్ర‌భుత్వ‌మూ.. చేయ‌ని విధంగా ఇప్పుడు ఏపీ ప్ర‌భుత్వం.. అనేక సంక్షేమ ప‌ధ‌కాలు అమ‌లు చేస్తోంద‌ని చెబుతున్నారు. గ‌తంలో నాయ‌కులు నాయ‌కులు  ప్ర‌జ‌ల సొమ్మును తిన్నార‌ని.. ఇప్పుడు..అదే ప్ర‌జ‌ల సొమ్మును తిరిగి క‌ష్టాల్లో ఉన్న‌వారికి, పేద‌ల‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం వివిధ సంక్షేమ కార్య‌క్ర‌మాల కింద ఇస్తోంద‌ని.. గ‌తంలో ఏ ప్ర‌భుత్వ‌మైనా.. ఒకే సారి ఒక్క ప‌దివేల రూపాయ‌ల‌ను ప్ర‌జ‌ల‌కు ఇచ్చిందా?  అని ప్ర‌శ్నిస్తున్నారు.

అంతేకాదు.. ఇప్పుడు అన్ని సామాజిక వ‌ర్గాల‌కు ఏదో ఒక రూపంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం న్యాయం చేస్తోంద‌ని.. అప్పుల‌ను పెద్ద‌గా చూడాల్సిన అవ‌స‌రం లేద‌ని.. రేపు పెట్టుబ‌డులు వ‌స్తే.. వాటి ద్వారా వ‌చ్చే నిధుల‌ను .. తీర్చేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని.. చెబుతున్నారు. మ‌రి నిజ‌మేక‌దా! అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: