`ఎల‌క్ష‌న్ కోడ్ ఎత్తివేత‌కు కేంద్రానికి లేఖ`

Paloji Vinay
ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఏకగ్రీవం అయిన జిల్లాలలో ఎలక్షన్ కోడ్ ఎత్తివేత పై కేంద్ర ఎన్నికల సంఘం కు లేఖ రాశాం అని చీఫ్ ఎలాక్ట్రోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ తెలిపారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలల‌కు సంబంధించి.. ఆదిలాబాద్ జిల్లాలో 8 పోలింగ్ స్టేషన్ లు ఉండ‌గా మొత్తం 937 ఓటర్లు ఉన్నార‌ని ఒక్కో స్థానానికి ఇద్ద‌రు అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్న‌ట్టు తెలిపారు. కరీంనగర్ లో 8 పోలింగ్ స్టేషన్లు ఉండ‌గా 1324 ఓటర్ లు ఉన్నార‌ని.. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు 10 మంది బరిలో ఉన్నారని చెప్పారు.

 ఉమ్మ‌డి మెదక్ జిల్లాలో 9 పోలింగ్ స్టేషన్ లు ఉండ‌గా.. 1026 ఓటర్ లు ఉన్నారు. ఒక్క స్థానానికి ముగ్గురు అభ్యర్థలు బరిలో ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 8 పోలింగ్ స్టేషన్ లు ఉండ‌గా.. 1271 ఓటర్ లు ఉన్నారు.. ఇక్క‌డ ఒక్క స్థాననికి అధికంగా ఏడుగురు అభ్య‌ర్థులు బరిలో ఉన్నారు. ఖమ్మం జిల్లాలో 4 పోలింగ్ స్టేషన్ లు ,  768 ఓటర్ లు ఉన్నారు. ఉమ్మడి ఖ‌మ్మం జిల్లా ఎమ్మెల్సీ స్థానానికి న‌లుగురు అభ్య‌ర్థులు బరిలో ఉన్నారు. ఈ జిల్లాలో మొత్తం 5,326 ఓటర్ లు ఉండ‌గా.. 37 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి.


 అలాగే.. ఎన్నిక‌ల వేళ కరోనా నియమాలు పాటించాలి అని చీఫ్ ఎలాక్ట్రోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ కోరారు. ఓటర్లు తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలి అని సూచించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ దగ్గర  జరిగిన ఘటన పై కలెక్టర్ దగ్గర నివేదిక తెప్పించి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించిన‌ట్టు తెలిపారు. ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఓటర్లను  ప్రలోభాలు కు గురి చేసే వారిపై, క్యాంప్ రాజకీయాల పై ప్రత్యేక దృష్టి  సారిస్తామ‌ని చెప్పారు. అభ్యర్థుల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదు పై విచారణ జరిపి  కేంద్ర ఎన్నికల సంఘం కు పంపిస్తాం అంటూ శ‌శాంక్ గోయ‌ల్ వెల్ల‌డించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: