చిన్న దేశాలు కూడా.. చైనా ను పక్కన పెట్టేస్తున్నాయి..!

Chandrasekhar Reddy
చైనా విషయంలో చిన్న దేశాలలోని ప్రజలు కూడా ఒక స్పష్టతకు వచ్చేశారు. తాజాగా చోటుచేసుకున్న ఒక ఘటనే అందుకు సాక్ష్యం. చైనా తీరు తైవాన్ విషయంలో మారడం లేదు. అలాగని దానిని ఈ విషయంలో మద్దతుగా నిలుస్తున్న వారు ఎవరు లేరు. అందరు ఆఫ్ఘన్ పరిస్థితి చుసిన తరువాత మరో దేశం అలా ఇబ్బడి పడటాన్ని జీర్ణించుకోలేకపోతుండొచ్చు. అందుకే చైనా తీరును ప్రపంచం ఏకకంఠంతో వ్యతిరేకిస్తుంది. అయినా బహుశా చైనా బెదిరింపు వలన కావచ్చు కొన్ని దేశాలు దానికి మద్దతు పలకడానికి అడుగులు వేయడం చేస్తున్నాయి. అయితే ఆయా దేశాలలో ని ప్రజలు మాత్రం తమ ప్రభుత్వ తీరును ఎండగడుతూ తీవ్రంగా నిరసనలు చేపడుతూ, చైనా కు మద్దతు పలకడాన్ని ఉపసంహరించుకోవాలని స్పష్టం చేస్తున్నారు.
ముఖ్యంగా తైవాన్ విషయంలో చైనా తో ఎవరు మద్దతు పలుకుతున్నప్పటికీ ఆయా దేశాల ప్రజలు ఇదే తరహాలో స్పందిస్తున్నారు. ఇలా కరోనా తరువాత కూడా చైనా ఆఫ్ఘన్ ఆక్రమణ చేసిన తాలిబన్ లకు మద్దతు తెలపడాన్ని, మయన్మార్ లాంటి దేశాలలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసి నిరంకుశ పాలనను తేవడాన్ని అంతర్జాతీయ సమాజం చూస్తూనే ఉంది. ఇవ్వన్నీ గమనించిన ఆ సమాజం, చైనా అంటేనే మండిపోతుంది. అందుకే తమ దేశ ప్రభుత్వాలు పొరపాటున చైనాకు మద్దతు పలికితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఆయా దేశాలలోని ప్రజలు. తాజాగా చిన్న ఐలాండ్ లో ఈ తరహా పరిస్థితి నెలకొంది.
ఆ ఐలాండ్ లో ప్రభుత్వం తైవాన్ విషయమై చైనాకు మద్దతు పలకడంతో, అక్కడి ప్రజలు తీవ్రంగా నిరసనలు తెలిపారు. ఏకంగా పార్లమెంట్ ను తగలబెట్టి మరీ ప్రభుత్వాన్ని మద్దతు ఉపసంహరించుకునేట్టుగా చేశారు. ఇది చైనా కు అంతర్జాతీయ సమాజంలో ఉన్న గ్రాఫ్. ఇది అప్పుడే పోయేది కాదు, ఎందుకంటే ఎలాగూ చైనా తన తీరు మార్చుకోదు కాబట్టి. ఇంత జరుగుతున్నప్పటికీ చైనా, పాక్ లు తమ కుతంత్రాలను మార్చుకుంటున్నారు తప్ప బుద్ధి మార్చుకునే ప్రయత్నం మాత్రం చేయబోవడం లేదు. ఆ రెండు కాదు మూడు దేశాలు ఇక మారకపోవచ్చు. సమాజానికి అవన్నీ ఎప్పటికి పీడగానే ఉంటాయో ఏమిటో!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: