పాక్ లో.. మత పెట్టుబడులు..!
తాజాగా దానికి తగ్గట్టే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తమ దేశాన్ని నడపడానికి కనీస ఆర్థిక స్థితి కూడా లేదని ప్రపంచానికి చాటేశారు. ఇలా చాటడం ద్వారా కాస్తోకూస్తో జాలి లభిస్తుందని ఆశించి ఉండవచ్చు. అయినా తీవ్రవాదులకు నెలవుగా ఉన్న దేశంగా గుర్తించబడిన పాక్ లో పెట్టుబడులు పెట్టి నసపొవడానికి ఎవరు మాత్రం ముందుకు వస్తారు. అందుకే దాదాపుగా అప్పులు తీసుకోవడం తప్ప పెట్టుబడులు ఆ దేశానికి పెద్దగా ఏమి ఉండబోవు. ఒకవేళ ఏవైనా ఉన్నాయంటే అవన్నీ ఏ తీవ్రవాద సంస్థకు బయపడో వారి ప్రభావం వలననో వచ్చినట్టు బావించాల్సిందే. ఎందుకంటే చూసిచూసి ఎవరూ కూడా వ్యాపారం నష్టాలకు పెట్టుకోలేరు కదా. ప్రస్తుతం ఆఫ్ఘన్ కంటే మెరుగ్గా ఏమి లేదు పాక్ పరిస్థితి.
అయితే తాజాగా తమ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నారని పాక్ ప్రకటించుకుంది. అది కూడా మతపరమైన పెట్టుబడిగానే కనిపిస్తుంది. ముందుగా చెప్పుకున్నట్టుగా ఏ తీవ్రవాద సంస్థ బెదిరింపులకు లోబడి ఈ పెట్టుబడి వచ్చినట్టుగానే కనిపిస్తుంది. ఆర్థిక సంక్షోభం తీవ్రంగా ఉన్న పాక్ లో పెట్టుబడులు పెట్టి ఎవరు నష్టాలు కొని తెచ్చుకుంటారు అనేది వాస్తవం. అజర్ బైజాన్ పాక్ లో పెట్టుబడి పాక్ లో పెట్టేందుకు సిద్ధం అయ్యిందని పాక్ చెప్పుకుంటుంది. మతపరమైనదే అని చెప్పడానికి ఇదే ప్రాతిపదిక. మతపరంగా ఆయా దేశాలను ఉగ్రసంస్థలు ఏకం చేయడం లో భాగంగా ఇవన్నీ జరుగుతున్నట్టే ఉంది. అప్పుడు మతపరంగా దేశాలమధ్య చిచ్చు పెట్టడానికి వాళ్లకు కాస్త వెసులుబాటు లభిస్తుంది అన్నది వాళ్ళ వ్యూహం కావచ్చు.