పరిటాల ఫ్యామిలీకి ‘ఒకటే’...శ్రీరామ్‌కు ఛాన్స్ లేదా?

M N Amaleswara rao
అనంతపురం జిల్లా రాజకీయాల్లో కీలకంగా ఉన్న పరిటాల ఫ్యామిలీ చేతుల్లో రెండు నియోజకవర్గాలు ఉన్న విషయం తెలిసిందే. చంద్రబాబుకు పరిటాల ఫ్యామిలీపై ఉన్న నమ్మకంతో రెండు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు. రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గ బాధ్యతలు పరిటాల ఫ్యామిలీనే చూసుకుంటుంది. అయితే రెండు నియోజకవర్గాలు టీడీపీకి కంచుకోటల్లాంటి నియోజకవర్గాలే.
అయితే గత ఎన్నికల్లో ఫ్యాన్ గాలిలో టీడీపీ కంచుకోటలు కుప్పకూలిన విషయం తెలిసిందే.  రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లో కూడా అదే పరిస్తితి. రెండు చోట్ల వైసీపీ జెండా ఎగిరింది. ఇక వైసీపీ జెండాని దించడానికి పరిటాల ఫ్యామిలీ గట్టిగానే కష్టపడుతుంది. ముఖ్యంగా పరిటాల శ్రీరామ్ రెండు నియోజకవర్గాలపై ఫోకస్ చేసి పనిచేస్తున్నారు. ఎలాగైనా రెండు చోట్ల ఈ సారి టీడీపీ జెండా ఎగరవేయాలని చూస్తున్నారు. రెండుచోట్ల వైసీపీ ఎమ్మెల్యేలని ఓడించడమే లక్ష్యంగా అడుగులేస్తున్నారు.
అయితే ప్రస్తుతం రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లో పరిస్తితి ఎలా ఉంది...ఇప్పుడు కూడా వైసీపీ బలం అలాగే ఉందా...లేక టీడీపీ పుంజుకుందా అనే విషయాలని ఒక్కసారి గమనిస్తే...రాప్తాడులో వైసీపీపై కాస్త వ్యతిరేకత పెరుగుతున్నట్లే కనిపిస్తోంది. ఇక్కడ పరిటాల ఫ్యామిలీ త్వరగానే పికప్ అవుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే రెండున్నర ఏళ్లలో అంటే...ఎన్నికల్లోపు రాప్తాడులో వైసీపీపై ఇంకా వ్యతిరేకత పెరిగితే ఇక్కడ టీడీపీ గెలుపు సులువే.
అటు ధర్మవరం నియోజకవర్గానికి వస్తే..వైసీపీ బలం ఇంకా తగ్గలేదనే తెలుస్తోంది. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. అసలు రాష్ట్రంలో ప్రజా మద్ధతు ఎక్కువగా ఉన్న టాప్-10 ఎమ్మెల్యేల్లో కేతిరెడ్డి ఉంటారని చెప్పొచ్చు. అలాంటప్పుడు ధర్మవరంలో కేతిరెడ్డికి చెక్ పెట్టడం శ్రీరామ్‌కి సాధ్యమయ్యే పని కాదు. ఒకవేళ ఎన్నికల్లోపు ఏమన్నా పరిస్తితులు మారితే అప్పుడు ఛాన్స్ ఉంటుంది. అయితే రాప్తాడులో సునీతమ్మ, ధర్మవరం బరిలో శ్రీరామ్ దిగుతారని తెలుస్తోంది. ఇందులో ధర్మవరంలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పై శ్రీరామ్‌కు గెలిచే ఛాన్స్ తక్కువగా ఉందనే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: