అన్ని దళాలను సిద్ధం చేస్తున్న భారత్..!

Chandrasekhar Reddy
భారతదేశ ప్రభుత్వం తన రక్షణ దళాలను అన్ని సమయాలకు సిద్ధం చేస్తుంది. దేశ రక్షణ వ్యవస్థలో ఆర్మీ, నేవి, ఎయిర్ ఫోర్స్ అనే విభాగాలు ప్రధానంగా ఉన్నాయి. ఇవన్నీ గతంలో ఎవరి పరిధిలో వాళ్ళు ఉండటం తెలిసిందే. తాజాగా అన్నిటిని సమన్వయము చేసేందుకు ఉమ్మడి వ్యవస్థను కూడా నియమించారు. తద్వారా అన్ని సమయాలలో ముగ్గురు సమన్వయంతో పనిచేసే అవకాశాలు ఉండనున్నాయి. గతంలో ఈ వ్యవస్థల మధ్య ఉన్న ఏవైనా చిన్న చిన్న బేదాభిప్రాయాలు కూడా ఈ ఉమ్మడి వ్యవస్థ వలన కనుమరుగైపోనున్నాయి. ఇక తాజా పరిస్థితి చూస్తే, ఒకపక్క ఎప్పటిలాగానే పాక్ చొరబాట్లు, మరోవైపు చైనా సరిహద్దు కవ్వింపు చర్యలతో కాస్త రక్షణ రంగం అనుక్షణం ఉత్సాహంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అందుకు అన్ని రకాల దళాలు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే భారతప్రభుత్వం ఇటీవల ఈ మూడు రక్షణ దళాలు కలిసి పనిచేసే విధంగా కొత్త కార్యాచరణ తీసుకువచ్చింది. అంటే ఆర్మీ విధులను ఇకమీదట మిగిలిన రెండు దళాల వారు(నేవి, ఎయిర్ ఫోర్స్) కూడా తెలుసుకుంటూ, ఆయా పరిస్థితులను ఆకళింపు చేసుకోనున్నారు. కేవలం యుద్ధం సమయంలో మాత్రమే కాకుండా పరిస్థితులను కూడా అర్ధం చేసుకోవడం ద్వారా వ్యూహరచన మరింత క్షుణ్ణంగా చేయవచ్చనేది తాజా నిర్ణయం వలన కలిగే ప్రయోజనాలు. ఇలా చేయడం ద్వారా ఒకరి పనిలో మరొకరికి నైపుణ్యం కూడా వస్తుంది. ఇది యుద్ధ సమయంలో చాలా అక్కరకు వస్తుంది.
ఈ తాజా నిర్ణయంతో దాదాపు 30-40వేల మంది సైన్యం త్రివిధ దళాలలో ఉమ్మడి తర్ఫీదు తీసుకోనున్నారు. వీరందరూ అన్ని రంగాలలో నైపుణ్యం సాధించడం ద్వారా యుద్ధ సన్నివేశాలలో మాత్రమే కాకుండా అనుక్షణం సిద్ధంగా ఉండే తరహా ఉపయోగాలు ఉన్నాయి. ఈ విధానం ప్రస్తుత పరిస్థితుల వలన ఏర్పాటు చేయబడినప్పటికీ శాశ్వతగా స్వాగతించదగింది. ఎప్పుడు సైన్యం సిద్ధంగా ఉండటం ద్వారా రక్షణ మరింత కఠినంగా అమలు చేయబడుతుంది. దేశంలో ఈ రక్షణ వ్యవస్థ ఎంత దృడంగా ఉన్నప్పటికీ, అంతరంగ ఉన్న రక్షణ వ్యవస్థ కూడా సరిగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముందు ఈ అంతర వ్యవస్థ సరిగా ఉంటె, దాదాపు సమస్యలు రావు. అందుకు కూడా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొంటే బాగుంటుంది. అన్ని ప్రభుత్వాలే చేయాల్సిన పనిలేదు, కొన్ని పౌరులు కూడా చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: