బాలాకోట్ పై.. ఇంకా సందేహాలేనా..!

Chandrasekhar Reddy
విలువలు లేని రాజకీయాలు ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడక్కడా కూడా ఆయా ప్రధాన వ్యవస్థలపై నమ్మకం లేని స్థితికి తెచ్చేస్తారు. నిజానికి ఒక దేశానికి రక్షణ వ్యవస్థ ఎంతో ముఖ్యం. దానిపై ఎంతో విశ్వాసం ఉంచడం కూడా సహజం. కానీ దిగజారుడు రాజకీయాలు ఈ వ్యవస్థలను కూడా నిర్మొహమాటంగా నాశనం చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. వాటిపై కనీసం నమ్మకం లేకుండా ప్రవర్తిస్తున్నాయి. ఈ విషయం అలాగే వదిలేస్తే ప్రజలలో కూడా ఆయా వ్యవస్థలపై ఉన్న నమ్మకాన్ని పూర్తిగా సన్నగిల్లే విధంగా చేస్తారు ఈ రాజకీయనేతలు, వారి కి అండగా ఉన్న ఇతర వ్యవస్థలు. ఇలాంటివి జరగటం ఆయా దేశాలకు తీరని లోటును తెచ్చిపెడతాయి. ఇటువంటి వారిని దేశద్రోహులుగా భావించి శిక్షలు వేయడం కూడా అంత సులభం కాదు. అందుకే పౌరులే తగిన విధంగా తమ దేశంపట్ల బాధ్యతాయుతంగా ఉండాల్సి ఉంటుంది.
పాక్ ప్రేలాపనలు భరించలేక బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత బాలాకోట్ రహస్య ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. దానిలో పాక్ లో స్థావరం ఏర్పాటు చేసుకున్న అనేక మంది తీవ్రవాదులు హతం అయ్యారు. ఈ విషయం ప్రపంచానికి తెలిసింది. ప్రపంచం అంతా ఈ విషయం నమ్మింది కానీ మనలో ఉన్న ముసుగు మనుషులు ఇంకా ఆ విషయాన్ని నమ్మలేకపొతున్నారు. వారు  నమ్మకపోతే ఎవరికీ నష్టం లేదనుకుంటే పొరపాటే, వాళ్ళు నమ్మకపోగా, ఇంకా ఆ విషయంపై ఎప్పటికప్పుడు సంశయాలు తెరపైకి తెస్తూ ఆయా వ్యవస్థలపై లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు. వీళ్ళను ఏమనాలో తెలియదు. కనీసం దేశభక్తి కూడా లేని ఇలాంటి వారిని ఉపేక్షించడం ఏమిటో మరి!
తాజాగా కూడా బాలాకోట్ ఘటనపై రక్షణ వ్యవస్థ సమాధానం చెప్పాల్సి వచ్చింది అంటే, ఆ వ్యవస్థపై ఈ వర్గాలు ఎంతగా అపనమ్మకం వ్యక్తం చేసి ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు. వారికి నమ్మకం లేకపోతే వదిలేయాలి అంటే కానీ వ్యవస్థను వేలెత్తి చూపించే అధికారం వారికి ఎక్కడి ఉంది వచ్చింది. కేవలం ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు, అధికారం కోసం ఇలాంటి తప్పుడు మార్గాలు కూడా రాజకీయ వర్గాలు తెరపై తెస్తున్నాయంటే వారు ఎంతగా దిగజారిపోయి ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. రాజకీయాలు అంటేనే జుగుబ్స కలిగించే సమయంలో కొందరు నేతలు తెస్తున్న మార్పులు వీళ్ళలాంటి వారి నీడ పడటంతో అబాసుపాలైపోతున్నాయి. వ్యవస్థలను నాశనం చేస్తూ అధికారం చేజిక్కించుకున్నంత మాత్రాన అది ఎంతకాలం ఉంటుందని వారి నమ్మకమో తెలియదు కానీ స్వదేశాన్ని వెన్నుపోటు పొడిచి సాధించేది ఏమిటో వారి విజ్ఞతకే వదిలేయలేమో!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: