కొండపల్లి @ వన్ మెన్ ఆర్మీ..!

Podili Ravindranath
దశాబ్దాల చరిత్ర కలిగిన కొండపల్లి కోటలో టీడీపీ జెండా రెప రెపలాడబోతోంది. రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న తెలుగు దేశం పార్టీకి కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నిక కొండంత బలాన్ని తెచ్చిపెట్టింది. ప్రతిష్టాత్మకంగా జరిగిన పుర పోరులో టీడీపీ కౌన్సిలర్లు గెలుపొందడం ఘన విజయం అయితే..... కొండపల్లి పాలకవర్గం టీడీపీ వశం చేసుకోవడం చారిత్రక విజయంగా పరిగణిస్తున్న పరిస్థితి. ఇంతటి చారిత్రక విజయానికి బాటలు వేసిన ఏకైక నాయకుడు విజయవాడ ఎంపీ కేశినేని నాని. ఆయన ఎక్స్అఫిషియో ఓటు వేయడంతో సరిపెట్టకుండా గెలుపొందిన 15 మంది టీడీపీ అభ్యర్థులను ఒడిసి పట్టుకోవడంలో సఫలీకృతమయ్యారు. రాజకీయంగా ఓనమాలు నేర్చుకున్న టీడీపీ అభ్యర్థులకు ప్రత్యక్ష రాజకీయాలను సవివరంగా వివరించి అభ్యర్థుల్లో నిజాయితీని, నిబద్ధతను నూరి పోసినట్లు కనిపిస్తోంది. కేవలం ఎంపీ కేశినేని నాని ఎంట్రీతోనే అభ్యర్థులు అధికార పార్టీ ప్రలోభాలకు లోను కాకుండా జాగ్రత్త పడగలిగారు అనేది బహిరంగ రహస్యంగా కనిపిస్తోంది.
తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటూ అభ్యర్థులను తన వెనుకే ఉంచుకొని రాజకీయాల్లో నూతన అధ్యాయానికి నాంది పలికారు. పాలకవర్గం ఎంపిక ప్రక్రియ మొదలయిన నాటి నుండి టీడీపీ అభ్యర్థులకు అండగా నిలబడ్డారు. ఫలితంగా ప్రతిష్ఠాత్మక కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ వశం చేసుకునే అవకాశాలు బలపడ్డాయి. ఈ మొత్తం ఎపిసోడ్ లో నీతి లేని రాజకీయాలు నడుస్తున్న తరుణంలో ఎంపీ కేశినేని నాని నిజాయితీ గల రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తూ గెలుపొందిన 15 మంది టీడీపీ కౌన్సిలర్ లను రోల్ మోడల్ గా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు నిశితంగా పరిశీలిస్తున్న కొండపల్లి ప్రజలు.. ఎంపీ కేశినేని నాని లేకుంటే కొండపల్లి చేజారిపోయేదని తెలుగు తమ్ముళ్ళు భావిస్తున్న పరిస్థితి. ఏది ఏమైనా గత మూడు రోజులుగా నడుస్తున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో 15 మంది టిడిపి వార్డు కౌన్సిలర్ లు టిడిపి చైర్మన్ అభ్యర్థికి మద్దతు తెలపడం కొండపల్లి చారిత్రక విజయానికి పునాది వేసిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: