జగన్ సర్కార్ కు ఇబ్బందులు ఇకపై వారిని పక్కన పెట్టేస్తారా ?

Santhi Kala
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ప్రభుత్వ పరంగా కొన్ని కొన్ని ఇబ్బందులను కాస్త గట్టిగానే ఎదుర్కొంటోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని అంశాలకు సంబంధించి ఈ మధ్య కాలంలో హైకోర్టు అదే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. అలాగే విపక్షాలకు సమాధానం చెప్పే విషయంలో ముందుకు వెళ్లలేక పోవడం వంటివి కాస్త ఇబ్బందికరంగా మారాయి. మూడు రాజధానులు అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి వైయస్ జగన్ వెనక్కి తగ్గడం ఈ మధ్యకాలంలో బాగా సంచలనంగా మారిన విషయం. జగన్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కు తగ్గడం అనేది ఈ మధ్య కాలంలో ఇదే తొలిసారి గా చెప్పాలి.
అయితే దీని వెనుక ఉన్న కారణం ఏంటనేది తెలియక పోయినా కొన్ని కొన్ని న్యాయపరమైన చిక్కులు రావడం ఆ చిక్కుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం బయటపడే అవకాశం లేకపోవడంతో నే ఈ విషయంలో జగన్ ఏమీ చేయలేకపోయారని అంటున్నారు. అయితే త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయవాదులను అడ్వకేట్ జనరల్ను కూడా మార్చే అవకాశం ఉందని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సరైన సలహాలు ఇవ్వలేకపోతున్న కొంతమంది కీలక శాఖలను సలహాదారులను కూడా పక్కన పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి పూర్తి స్థాయి లో సహకారం ఉన్నా సరే చాలా మంది సలహాదారులు నామమాత్రంగానే ఉన్నారని వాళ్ళందరూ కూడా జగన్ను వాడుకోవడమే గాని ఎక్కడా కూడా జగన్కు అండగా నిలిచే పరిస్థితి లేదని తెలుస్తోంది. దీంతో కొంతమంది కీలక సలహాదారులను జగన్ పక్కన పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఎవరైతే తన మాట లెక్క చేయడం లేదో వాళ్లందరూ మీద కూడా జగన్ ప్రత్యేక దృష్టి పెట్టి వారిని తప్పించేందుకు మార్గం కూడా సిద్ధం చేశారని సమాచారం.చూడాలి మరి రాబోయే  రోజుల్లో జగన్ నిర్ణయం ఎలా ఉండబోతుందో 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: