జగన్ సినీ ఇండస్ట్రీపై కసి తీర్చుకుంటున్నాడా..?

Chakravarthi Kalyan
ఏపీ అసెంబ్లీ సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవరించింది. సామాన్యుడికి కూడా వినోదం అందాలన్న లక్ష్యంతో.. సినీరంగంలో పారదర్శకత పెంచాలన్న లక్ష్యంతో ఈ చట్టం తెచ్చామని ఏపీ సర్కారు చెబుతోంది. అయితే.. ఈ చట్టం ద్వారా జగన్ సినీరంగంపై కక్ష సాధిస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. ఎందుకంటే.. సినీరంగంలోని ఒకరిద్దరు ప్రముఖులు తప్పితే మిగిలిన అగ్రనాయకులు, నిర్మాతలు, ఇతర ముఖ్యులంతా మొదటి నుంచి సీఎం జగన్ పట్ల అంత సానుకూలంగా లేరు. పోనీ.. జగన్ సీఎం అయ్యాక కూడా ఆయన్ను పట్టించుకున్నది లేదు.

అందుకే జగన్ సినీ పరిశ్రమను ఓ ఆట ఆడుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ కొత్త చట్ట సవరణకు ప్రభుత్వం చెప్పే కారణాలు కూడా సరిగా కనిపించడం లేదు. సామాన్యుడికి వినోదం అందడం లేదని చెబుతున్న కారణానికి తగిన సహేతుకత కనిపించడం లేదు. మరి ఇదే ప్రభుత్వం మద్యం విషయంలో సామాన్యుడికి అందుబాటులో ఉంచుతుందా.. పెట్రలో ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉంచుతుందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. పేద, మధ్య తరగతికి నిత్యావసరాలు అందుబాటులో ఉంటున్నాయా అన్న ప్రశ్నకూ సమాధానం దొరకదు.

మరి నిత్యావసరాలను గాలికొదిలి.. వినోదం, విలాసం కేటగిరీలోకి వచ్చే సినిమా విషయంలో అంత పట్టింపు ఎందుకన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంతే కాదు.. ప్రస్తుతం జగన్ కి మద్దతు ఇచ్చిన వారికి మార్కెట్ పరిధి చాలా చాలా తక్కువ కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నారన్న వాదన వినిపిస్తోంది. ఈ నిర్ణయంతో ఎక్కువగా నష్టపోయేది మార్కెట్ పరిధి ఎక్కువగా ఉన్న పవన్ కళ్యాణ్, చిరంజీవి, తారక్, బన్నీ, చరణ్, ప్రభాస్, మహేష్  వంటి అగ్ర హీరోలే.

జగన్ చేసిన ఏ నిర్ణయమైనా అభిమానులకు అనుకూలంగానే ఉంటుందని చెప్పొచ్చు. అమరావతి సహా పలు అంశాలలో అగ్రనటులు స్పందించలేదన్న ఆగ్రహంతో ఉన్న టీడీపీ అభిమానులకు కూడ ఈ జగన్ నిర్ణయం ఆనందం కలిగించొచ్చేమో. ఏదేమైనా ఈ చట్ట సవరణతో ప్రభుత్వ కలెక్షన్స్ పెరుగుతాయ్.. సినిమా కలెక్షన్స్ తగ్గుతాయ్.. ఈ చట్ట సవరణ లక్ష్యం ఒకరు.. నష్టపోయేది మరొకరు అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: