టీవీ చానల్స్ పై తాళిబన్ల ఆంక్షలు.. ఏమిటి..?

MOHAN BABU
ఆఫ్ఘనిస్తాన్ మహిళలపై తాలిబాన్లు మరోసారి కొరడా ఝుళిపించారు. టీవీలో ప్రసారమయ్యే కార్యక్రమాల్లో మహిళల పాత్రల పై కొత్త ఆంక్షలు తెరపైకి తెచ్చారు. తాలిబన్లు ఆఫ్ఘన్ ను చేజిక్కించుకున్న నాటి నుండి మహిళలను వంటింటి కుందేళ్లను చేస్తూ పలు ఆదేశాలు జారీ చేశారు. తాజాగా మహిళలు టీవీ షోల్లో పాల్గొనకుండా ఆదేశాలు జారీ చేశారు.  తాలిబన్లు విధించిన కొత్త రూల్స్ చాలా విచిత్రంగా ఉన్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాలికలు, మహిళలు స్కూళ్ల కి వెళ్ళోద్దంటూ తాలిబన్లు ఇప్పటికే ఆదేశించారు. తాజాగా మహిళలు నటించిన షోల ను ప్రసారం చేయద్దంటూ ఆఫ్గాన్ టీవీ చానళ్లకు తాలిబన్లు మార్గదర్శకాలు  రిలీజ్ చేశారు. షరియా చట్టానికి వ్యతిరేకంగా ఉన్నా  సినిమాలను బ్యాన్ చేయాలన్నారు. టీవీ షో లో పురుషులు తమ శరీరాలను చూపించరాదు, మతం పై జోకులు వేస్తే కామెడీ షో లను పూర్తిగా బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆఫ్ఘనిస్తాన్ ను హస్తగతం చేసుకొని, పాలనా పగ్గాలు చేపట్టిన తాలిబన్లు తమ మోనార్క్ పాలన కొనసాగిస్తున్నారు. మహిళలను అణచివేసి పలు ఆంక్షలు విధిస్తూ సంచలనంగా మారారు.

మహిళలు కనిపించకూడదు, వారి స్వరం వినిపించ కూడదని వారి మోనార్క్ పాలనలో భాగంగా మరో విషయం  జారీచేశారు. మహిళలు నటించే  ఏ షో లు ప్రసారం చేయరాదని మీడియాకు హెచ్చరించారు. ఇప్పటికే మహిళలపై ఎన్నో ఆంక్షలు విధించిన తాలిబన్ నేతలు తాజాగా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలపై కొరడా ఝుళిపించారు. మహిళా నటులు ఉండే షోలు, కార్యక్రమాలు తక్షణమే నిలిపివేయాలని తాలిబన్ల ప్రభుత్వం మీడియా ను ఆదేశించింది. ఆడవారి తోపాటు మగవారికి పలు హుఖుం లు జారీ చేస్తూ నిత్యం నరకం చూపిస్తున్నారు. ఆఫ్గాన్ మంత్రిత్వ శాఖ నుంచి స్థానిక  మీడియాకు తొలి అధికారిక ఉత్తర్వులు జారీ ఇవే కావడం గమనార్హం. ఫిమేల్ యాక్టర్స్ ఉండే కార్యక్రమాలతో పాటు మహమ్మద్ ప్రవక్త, ఇతర ప్రముఖులను చూపించే సినిమాలను, ప్రోగ్రాం లను ఛానల్ లు ప్రసారం చేయరాదని ఆ దేశ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. వుమెన్ జర్నలిస్టులు రిపోర్టింగ్ చేసే  సభ్యుల్లో తప్పనిసరిగా బుర్కా ధరించాలని స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: