రేవంత్ అనుకున్నది జరగడం లేదా...?

Gullapally Rajesh
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్ని విధాలుగా కష్టపడుతున్న సరే పార్టీలో ఉన్న చాలామంది కీలక నాయకులు ముందుకు రాకపోవడంతో ఇప్పుడు ఆయన ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. పార్టీలో కొన్ని కొన్ని కీలక అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నా సరే అవి ముందుకు రాకపోవడం పట్ల రేవంత్ రెడ్డి కాస్త అసంతృప్తిగా ఫీలవుతున్నారు అనే భావన కొంతవరకు వ్యక్తమవుతోంది. రాజకీయంగా పార్టీని ముందుకు నడిపించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం రేవంత్ రెడ్డికి అన్ని విధాలుగా సహకరిస్తోంది.
కానీ రేవంత్ రెడ్డి మాత్రం కొన్ని కొన్ని విషయాల్లో పార్టీ నాయకులను ముందుకు నడిపించే విషయంలో విఫలమవుతున్నారు అనే భావన వ్యక్తమవుతోంది. రాజకీయంగా ఇప్పుడు తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశం అనేది భారతీయ జనతా పార్టీకి అలాగే టీఆర్ఎస్ పార్టీలో ప్రధాన అస్త్రంగా మారిన సరే దాన్ని కాంగ్రెస్ పార్టీ వాడుకునే ప్రయత్నం చేయలేకపోతోంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది నాయకులు ఈ అంశానికి సంబంధించి మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి గానీ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేయలేకపోతున్నారు.
ఎంపీలు ఎవరూ కూడా పెద్దగా మాట్లాడక పోవడం కేవలం రేవంత్ రెడ్డి లేదా మల్లు భట్టి విక్రమార్క వంటి నాయకులు మాత్రమే మాట్లాడటం వంటివి జరుగుతున్నాయి. కీలక నాయకులుగా ఉన్న వారు సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేయకపోవడం పట్ల ఆందోళన మొదలైంది. ఇక రేవంత్ రెడ్డి ప్రజా ఉద్యమాలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నా సరే చాలా మంది కీలక నాయకులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం వ్యక్తిగత వ్యవహారాలు అలాగే టీఆర్ఎస్ పార్టీ నాయకులతో స్నేహం చేయడం వంటివి ఈ మధ్య కాలంలో తరచుగా జరుగుతూ వస్తున్నాయి. మరి భవిష్యత్తులో అయినా సరే సమర్థవంతంగా వ్యవహరిస్తారా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: