అంతా అబద్దం.. రెడ్ నోటీసులకు ఏపీ జవాబు..?

Chakravarthi Kalyan

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వైద్య పరికరాల సరఫరాను నిలిపివేయాలంటూ ఓ అసోసియేషన్ సోషల్ మీడియాలో ఉంచిన రెడ్ నోటీసుపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఇండియన్‌ మెడికల్‌ డివైసెస్‌ ఇండస్ట్రీ సోషల్ మీడియాలో ఉంచిన లేఖపై ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ మురళీధర్ రెడ్డి సమాధానం ఇచ్చారు.  ఇండియన్‌ మెడికల్‌ డివైసెస్‌ ఇండస్ట్రీ అసోసియేషన్ తరపున ప్రభుత్వానికి పంపిన లేఖలో స్పష్టమైన వివరాలు లేవని ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ మురళీధర్ రెడ్డి వివరణ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలుగైదు ఏళ్లుగా చెల్లింపులు చేయలేదంటూ అసోసియేషన్ సభ్యులు చేసిన ఆరోపణలు సరికావని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.  ఇదంతా పచ్చి అబద్దమని వివరణ ఇచ్చింది. గత రెండేళ్లలో కొనుగోలు చేసిన వైద్య పరికరాల కోసం రూ. 2 వేల కోట్లను చెల్లించామని ఏపీ ఎస్ఎంఐడీసీ ఎండీ మురళీధర్ రెడ్డి వివరణ ఇచ్చారు. కేవలం కొవిడ్-19కి సంబంధించి రెండు నెలల్లో  328 కోట్ల రూపాయల బిల్లులు మాత్రమే బకాయిలు ఉన్నాయని ఆయన తెలిపారు.

సోషల్ మీడియాలో అసోసియేషన్ ఖాతాలో ఉంచిన రెడ్ నోటిసుపై విచారణ చేయిస్తున్నట్టు  ఏపీ ఎంఎస్ఐడీసీ ఎండీ మురళీధర్ రెడ్డి వెల్లడించారు. దురుద్దేశపూర్వకంగా ఈ పోస్టులు ఉన్నట్టు తేలితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఏపీ ఎంఎస్ఐడీసీ ఎండీ మురళీధర్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాన్ని అంగీకరించబోమని అసోసియేషన్ కు రాసిన లేఖలో ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ మురళీధర్ రెడ్డి వెల్లడించారు.

ఇక నుంచి ఏపి ప్రభుత్వానికి ఎలాంటి మెడికల్ డివైజస్ సరఫరా చేయవద్దు అంటూ ఇండియన్‌ మెడికల్‌ డివైసెస్‌ ఇండస్ట్రీ రెడ్ నోటీసులు జారీ చేసినట్టు వచ్చిన వార్తలు కలకలం సృష్టించాయి.  ఆంధ్రప్రదేశ్ వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకు సంబంధించిన ఈ రెడ్ నోటీసులపై సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన వివరణపై మరి సదరు అసోసియేషన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: