చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఆ దేశప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఆదేశ ప్రభుత్వ పాలసీ లు ఆత్మహత్యాస్పదమైనవిగా ఉంటున్నాయి . చైనా ప్రభుత్వం నుండి వెలువడుతున్న చిన్న చిన్న ప్రకటనలు ఆదేశం లో త్వరలో ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోబోతు ఉంది అని అర్థమౌతూ వుంది. సరుకులను కొని నిల్వ ఉంచుకోండి ...కూరగాయలను , పండ్లను కడిగి ఆరబెట్టి నిల్వ చేసుకోండి ...ఇళ్లల్లో నిల్వలు పెంచుకోండి ..శీతాకాలం లో ఆహార కొరత రావచ్చు అంటూ చైనా ప్రభుత్వం చేస్తున్న ఈ చిన్న చిన్న ప్రకటనలు ఇందుకు ఊతాన్ని ఇస్తున్నాయి. చైనా లో తీవ్రమైన ఇబ్బందులు తలెత్తితే కానీ ఇలాంటి చిన్న చిన్న ప్రకటనలు చైనా చేయదు.
బలమైన కారణం ఉంటేనే ఇలాంటి ప్రకటనలు చేయదని ప్రపంచదేశాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ప్రస్తుతం అక్కడ కూరగాయలు కొనాలంటే ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయంటే అర్ధమౌతుంది ఎంతగా చైనా ఆహార సమస్యలను ఎదుర్కొంటూవుందో. అక్కడ కూరగాయల రేట్లు మాంసం రేట్ల కంటే అధికంగా ఉన్నాయ్. దీనికి ప్రధాన కారణం చైనాలో తాజాగా వచ్చిన వరదలు. వరదలవల్ల చైనా అంతర్ పంటలు నాశనం అయ్యాయి . చైనాలో లో ఉన్న దాదాపు 23,841 డ్యామ్ లలో నీళ్లు వర్షాలతో నిండి పొంగి పొర్లాయి ఈ సందర్భంలోనే చైనాలోని పంటలు , ఊర్లు నీట మునిగాయి. అయితే చైనాలో ఉన్న 23,841 డ్యామ్ ల నీటి నిల్వ సామర్థ్యం ప్రపంచం లో ఉన్న దాదాపు 41 % నీటి సామర్ధ్యానికి సమానం.
రాత్రికి రాత్రే వచ్చి చేరిన నీటితో డ్యాంలు పొంగి పొర్లాయి. ఆహార సంక్షోభానికి ఇదో కారణం అయితే చైనా కొన్ని దేశాలనుండి వస్తు దిగుమతులను నిరాకరించడం కూడా ఒక కారణం. ఇలాంటి తప్పుడు నిర్ణయాలతో చైనా ప్రభుత్వం ప్రజలను మరింతగా కష్టాల్లోకి నెడుతోంది. ఆస్ట్రేలియా మీద కోపంతో చైనా ఆ దేశ బొగ్గు దిగుమతులను పూర్తిగా నిరాకరించింది. దింతో ఆస్ట్రేలియాను ఆర్ధికంగా దెబ్బతీయాలనుకుంది చైనా , కానీ చెరువుమీద అలిగి ఏదో చేసిన చందంగా మారింది చైనా పరిస్థితి . బొగ్గు నిల్వలు తరిగిపోవడంతో చైనా లో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయే పరిస్థితులు దాపురించాయి. ఈ సమస్యను అధిగమించడానికి ఆదేశ ప్రధాన ఇంధన వనరు అయినటువంటి డీజిల్ ను విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించారు.రానురాను డీజిల్ నిల్వలు తరగిపోవడంతో ప్రజలు వాహనాలకు డీజిల్ దొరక్క ఇబ్బందులు పడుతున్నారు . ఈ విధంగా చైనా తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలతో దేశం అతలాకుతలం అవుతూఉంది.