బద్వేలు: రిజల్ట్ అప్పుడే వచ్చేసిందా..?

Chakravarthi Kalyan
బద్వేలు ఉపఎన్నిక ఈనెల 30 న జరగబోతోంది. దీనికి ఎన్నికల ప్రచారం పూర్తయింది. బద్వేలు ఫలితాలు నవంబర్ 2న ప్రకటిస్తారు. అయితే.. బద్వేలు ఉపఎన్నిక ఫలితం ముందే వచ్చేసిందంటున్నారు కొందరు వైసీపీ నాయకులు. బద్వేల్‌ ఎన్నికల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి దాసరి సుధ ఎప్పుడో గెలిచార‌ని వైసీపీ అంబ‌టి రాంబాబు అంటున్నారు. మెజారిటీ కోసమే తాము ప్రచార‌ం చేస్తున్నామని అన్నారు.

వైసీపీ నేత అంబటి రాంబాబు చివరి రోజు బద్వేల్‌ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బద్వేలు విషయంలో టీడీపీ జనసేన లోపాయకారి కుట్రలు కొనసాగిస్తున్నాయంటున్నారు అంబటి రాంబాబు. జనసేన కార్యకర్తలు కూడా బీజేపీ తరపున ప్రచారం నిర్వహిస్తున్నారని... జనసేన అధినేతకు నిజాయితీ ఉందా? అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. చనిపోయిన అభ్యర్థి వెంకట సుబ్బయ్య కుటుంబంపై సానుభూతితో పోటీకి దూరంగా ఉన్నామని పవన్ ఇప్పటికే చెప్పారని.. కానీ ఇప్పుడు జనసేన కార్యకర్తలు బీజేపీ తరపున ప్రచారం చేస్తున్నారని అంబటి అన్నారు.

మరి ఇప్పుడేంటి ఈ నీతిమాలిన రాజకీయమని అంబటి రాంబాబు ప్రశ్నించారు. అమిత్‌ షాపై రాళ్లు వేసిన ఘటన ఆయనకు గుర్తుండదా అన్న అంబటి.. అందుకే చంద్రబాబుకి అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని తెలిపారు. చంద్రబాబు వంటి అవకాశవాది ఎక్కడా ఉండరన్న అంబటి రాంబాబు.. మా ఊరు వస్తే రాళ్లు వేస్తాం... మీ ఊరు వస్తే కాళ్లు పట్టుకుంటాం అంటే ఎలా..? ప్రశ్నించారు.

బద్వేలు ప్రజలంతా పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గోవాలని అంబటి రాంబాబు పిలుపు ఇచ్చారు.  డాక్టర్‌ సుధను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండాఓటర్లు బూత్‌ దగ్గరకు వచ్చి స్వచ్ఛందంగా ఓటు వేయాలని కోరుకుంటున్నామని అంబటి అన్నారు. ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మరణాంతరం ఉప ఎన్నిక అనివార్యమైందన్న అంబటి.. వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్‌ సుధను స్వయంగా జగన్ నిలిపారని.. ఆమెను గెలిపించాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: