కాశ్మీర్ మొత్తం ఎప్పటికైనా భారత్ దే ..వాయిసేన అధికారి సంచలన కామెంట్స్


భారత దేశం స్వాతంత్య్ర అమృత మహోత్సవాలు జరుపుకుంటున్న వేళ...భారతీయల గుండెల్లో ఆ అధికారి ఆక్సిజన్ నింపారు. ఆయన చేసిన వ్యాఖ్యలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపైఎలాంటి ప్రభావాన్ని చూపుతుందన్న విషయం ప్రస్తుతానికి ఏమీ చెప్పలేం. కానీ నేడు ఆయన రియల్ హీరో అని మాత్రం చెప్పవచ్చు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను స్వాధీనం చేసుకునేందుకు ప్రస్తుతం ఎలాంటి ప్రణాళికలు లేవని, అయితే ఏదో ఒక రోజు భారత దేశంలో “మొత్తం కాశ్మీర్” ఉంటుందని వైమానిక దళానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు బుధవారం ఆశాభావం వ్యక్తం చేశారు.
బుద్గామ్‌లోని భారత సైనిక స్థావరంలో బుధవారం ఓ కార్యక్రమం జరిగింది. భారత సైనికులు బుద్గామ్‌లో దిగిన 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీనగర్‌లో జరిగిన కార్యక్రమంలో ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఆఫ్ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ ఎయిర్ మార్షల్ అమిత్ దేవ్ పాల్ పాల్గోన్నారు. తరువాత మీడియా తో మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు.
 పాక్ ఉగ్రవాదులను భారత భూభాగంలోకి ప్రవేశించకుండా  అడ్డుకునేందుకు భారత వైమానిక దళం జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గామ్‌లో దిగింది.  ఈ ఘటన జరగడానికి ఒక రోజు ముందే  కాశ్మీర్ పాలకుడైన  మహారాజా హరిసింగ్  ఈ రాష్ట్రాన్ని భారత్ లో విలీనం చేశారు అని ఆయన చెప్పారు. "...భారత వైమానిక దళం తో పాటు యావత్ సైన్యం 1947, అక్టోబర్ 27 న నిర్వహించిన అన్ని కార్యకలాపాలు కాశ్మీర్‌లోని ఈ భాగానికి స్వేచ్ఛను అందించాయి. " అని దేవ్ అన్నారు,   "ఎప్పుడో ఒకప్పుడు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా కాశ్మీర్‌లోని ఈ భాగానికి చేరుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను . రాబోయే సంవత్సరాలలో మొత్తం కాశ్మీర్ మనకు ఉంటుంది. ఇది ఎంతో దూరంలో లేదు " అని కూడా ఆయన అన్నారు
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను స్వాధీనం చేసుకునేందుకు ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా అని విలేఖరులు ప్రశ్నించగా... దేవ్ స్పష్టమైన సమాధానం చెప్పారు, ప్రస్తుతానికి అలాంటి ప్రణాళిక ఏమీ లేదని చెప్పారు. అయితే, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ప్రజలను "పాకిస్థానీలు చాలా న్యాయంగా చూడటం లేదు" అని ఆయన అన్నారు.ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోకుంటే "బహుశా కాశ్మీర్ మొత్తం మనదే అయివుండేది" అని దేవ్ అన్నారు.
-

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: