నర్సీపట్నంలో పూరి తమ్ముడుకు ఈ సారి ఈజీ కాదా?

M N Amaleswara rao
రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు....అధికారంలో ఉన్నవారు శాశ్వతంగా అధికారంలో ఉండలేరు....ప్రతిపక్షంలో ఉన్నవారు శాశ్వతంగా ప్రతిపక్షంలోనే ఉండరు...అలాగే వరుసగా గెలుస్తూ వస్తున్న నాయకులు ఎప్పుడో అప్పుడు దెబ్బ తినక తప్పదు..అదేవిధంగా ఓటమి చవిచూసిన నేతలు గెలుపు రుచి చూసే అవకాశం కూడా ఉండకమానదు. కాబట్టి రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పలేని పరిస్తితి. ఇప్పుడు అదే పరిస్తితి నర్సీపట్నం నియోజకవర్గంలో కనిపిస్తోంది.
అసలు ఇక్కడ టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడుకు తిరుగులేదని చెప్పాలి...టీడీపీ ఆవిర్భవించిన దగ్గర నుంచి ఎక్కువసార్లు గెలిచింది అయ్యన్న పాత్రుడే. ఇక 2014లో మరొకసారి గెలిచి మంత్రి అయ్యారు. అయితే నర్సీపట్నంలో అయ్యన్నకు తిరుగులేదని అంతా అనుకున్నారు. కానీ 2019 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది..అయ్యన్నకు సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు ఉమా శంకర్ గణేశ్ చుక్కలు చూపించారు.
అసలు గణేశ్...అయ్యన్న శిష్యుడు....ఆయన వెనుక తిరిగే రాజకీయాలు నేర్చుకున్నారు. ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళి 2014లో పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయినా సరే వెనక్కి తగ్గకుండా పనిచేసుకుంటూ వచ్చారు. వైసీపీని నర్సీపట్నంలో బలోపేతం చేశారు. దీంతో 2019 ఎన్నికల్లో సీన్ మారింది. పైగా జగన్ గాలి కూడా ఉండటంతో గణేశ్ ఎమ్మెల్యేగా గెలిచేశారు...తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన గణేశ్...తనదైన శైలిలో పనిచేసుకుంటూ వెళుతున్నారు...ఈ రెండున్నర ఏళ్లలో పర్వాలేదనిపించేలా పనిచేసుకుంటూ వస్తున్నారు.
అయితే అయ్యన్నని తక్కువ అంచనా వేస్తే అంతే సంగతులు అని ఇప్పుడుప్పుడే అర్ధమవుతుంది....గణేశ్‌కు ధీటుగా అయ్యన్న పికప్ అయ్యారు. మున్సిపల్, స్థానిక ఎన్నికల్లో వైసీపీకి ధీటుగా టీడీపీని గెలిపించుకున్నారు. అంతే టీడీపీని చాలా వరకు రేసులోకి తీసుకొచ్చారు. విశాఖ జిల్లాలో టీడీపీ పరిస్తితి ఎలా ఉందో తెలియదు గానీ, నర్సీపట్నంలో మాత్రం టీడీపీ బాగా పికప్ అయిందనే చెప్పాలి. పైగా వచ్చే ఎన్నికల్లో విశాఖలో గెలిచే సీట్లలో నర్సీపట్నంని కూడా కౌంట్ చేసుకునే పరిస్తితి వచ్చింది. అంటే ఈ సారి నర్సీపట్నంలో పూరి తమ్ముడుకు అంత ఈజీగా గెలుపు దక్కదనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: