టీడీపీతోనే నాదెండ్లకు ప్లస్...జనసేనతో కష్టమే..!

M N Amaleswara rao
నాదెండ్ల మనోహర్....ఏపీ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించిన నాదెండ్ల భాస్కరరావు వారసుడు. అయితే భాస్కరరావు సృష్టించిన సంచలనాలు ఏంటో అందరికీ తెలిసిందే. 1984 సమయంలో ఎన్టీఆర్‌ సీఎం పీఠం లాగేసుకుని పెను సంచలనం సృష్టించారు. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయో అందరికీ తెలిసిందే. అయితే నాదెండ్ల తన రాజకీయ జీవితం కాంగ్రెస్‌లోనే ఎక్కువ కాలం గడిపారు. ఇక నాదెండ్ల వారసుడుగా మనోహర్ రాజకీయాల్లోకి వచ్చారు.
ఈ క్రమంలోనే మనోహర్ సైతం కాంగ్రెస్‌లో రాజకీయ జీవితం మొదలుపెట్టి...2004 ఎన్నికల్లో తెనాలి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు...ఆ తర్వాత 2009 ఎన్నికల్లో సైతం విజయం సాధించారు..ఇక అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో స్పీకర్‌గా కూడా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత పరిస్తితులు మారిపోయాయి. కాంగ్రెస్ పూర్తిగా దెబ్బతినడంతో మనోహర్ సైతం...దానికి తగ్గట్టుగానే ముందుకెళ్లారు. అయితే బలంగా ఉన్న వైసీపీ, టీడీపీల్లో కాకుండా పవన్ కల్యాణ్ పెట్టిన జనసేనలోకి వెళ్లారు.
జనసేనలో ఇప్పుడు మనోహర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే రాజకీయంగా మనోహర్ జనసేనలో నిలదొక్కుకోవడం చాలా కష్టమనే చెప్పాలి. ఎందుకంటే జనసేన నుంచి బరిలో దిగితే మనోహర్‌కు విజయం దక్కడం అంత సులువు కాదనే చెప్పాలి. 2019 ఎన్నికల్లో తెనాలి బరిలో దిగిన మనోహర్‌కు ఎక్కువ ఓట్లు కూడా రాలేదు. అక్కడ టీడీపీ-వైసీపీల మధ్య ప్రధాన ఫైట్ జరిగింది. ఆ ఫైట్‌లో వైసీపీ విజయం సాధించింది. ఇప్పటికీ అక్కడ ఆ రెండు పార్టీల మధ్యే వార్ నడుస్తోంది.
అక్కడ మనోహర్‌కు గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. గత ఎన్నికల్లో మనోహర్‌కు 30 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి...వచ్చే ఎన్నికల్లో జనసేన తరుపున బరిలో దిగిన అదే పరిస్తితి. కాకపోతే టీడీపీతో పొత్తు ఉంటే మనోహర్‌కు తిరుగుండదని చెప్పాలి...మనోహర్‌కు గెలుపు సులువే. అయితే అప్పుడు తెనాలి సీటు వస్తుందా? లేక వేరే సీటులో పోటీ చేస్తారా? అనేది చూసుకోవాలి. అంటే టీడీపీ సపోర్ట్ ఉంటేనే మనోహర్‌కు ప్లస్ అవుతుందని చెప్పొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: