సిక్కోలులో సీన్ ఛేంజ్...పోటాపోటి వచ్చినట్లేనా..!

M N Amaleswara rao
ఏపీలో రాజకీయ వాతావరణం ఎప్పుడూ వేడిగానే ఉంటుంది...ఎన్నికలు ఉన్నా...లేకపోయినా ఇక్కడ పరిస్తితి మాత్రం హాట్ హాట్ గా ఉంటుంది. ఎప్పుడు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య రాజకీయ యుద్ధం నడుస్తూనే ఉంది. రెండు పార్టీలు మాటల యుద్ధం కూడా దాటేసి చేతల యుద్ధం వరకు వెళ్ళిపోయారు. అంటే ఎన్నికల్లో ఉండే యుద్ధం వాతావరణం...ఆంధ్రాలో నిత్యం ఉంటుంది. ఎక్కడకక్కడ రెండు పార్టీలు ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలని ప్రయత్నిస్తూనే ఉన్నాయి.
ఇప్పటికే ఎన్నికలై రెండున్నర ఏళ్ళు అవుతుంది...దీంతో పట్టు నిలుపుకోవాలని వైసీపీ, పట్టు దక్కించుకోవాలని టీడీపీలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఇదే క్రమంలో శ్రీకాకుళం(సిక్కోలు) జిల్లాలో రాజకీయం కూడా బాగా వాడివేడిగా సాగుతుంది. ఇక్కడ పట్టు దక్కించుకోవాలని టీడీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉంది. గత ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ అదిరిపోయే విజయాలు సొంతం చేసుకుంది. జిల్లాలో ఉన్న 10 సీట్లలో వైసీపీ 8 సీట్లు గెలుచుకోగా, టీడీపీ కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది.
అయితే ఇప్పటికే సిక్కోలులో ఇప్పటికీ అదే పరిస్తితి ఉందా? 8 సీట్లలోనే వైసీపీ బలం ఉందా....లేక ఇంకా బలం పెంచుకుందా? లేదంటే ఇంకా బలం తగ్గిపోయిందా? అటు టీడీపీ బలం పెంచుకుందా? లేక తగ్గించుకుందా అనే విషయాలని గమనిస్తే....కొద్దో గొప్పో టీడీపీనే తన బలం పెంచుకున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే సాధారణంగా అధికార పార్టీపై వ్యతిరేకత వస్తుంది...దానికి తోడు కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు అంతగా ఎఫెక్టివ్ గా పనిచేయడం లేదని తెలుస్తోంది..ఏదో జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు తప్ప, ఆ ఎమ్మెల్యేలకు వేరే ప్లస్ ఉన్నట్లు కనిపించడం లేదు.
దీనికి తోడు కొందరు ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండే విషయంలో కూడా వెనుకబడి ఉన్నారని తెలుస్తోంది. అయితే టీడీపీ నేతలు ఆయా నియోజకవర్గాల్లో పుంజుకున్నారు..ప్రజల్లో ఉంటూ వారి సమస్యలని తెలుసుకుంటున్నారు. దీంతో పలు నియోజకవర్గాల్లో టీడీపీ పికప్ అయిందని తెలుస్తోంది. జిల్లాలో 10 సీట్లు ఉంటే సగం వైసీపీ, సగం టీడీపీ అన్నట్లుగా పరిస్తితి ఉంది...అంటే సిక్కోలులో పోటాపోటి ఉందని చెప్పొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: