ధీమాతో ఉన్న అంబటి...?

Gullapally Rajesh
బద్వేల్ ఉప ఎన్నికల్లో గెలిచేది అధికార పార్టీనే అయినా సరే అక్కడ ప్రచారం మాత్రం విస్తృతంగా చేస్తుంది వైసీపీ. రాజకీయంగా ఈ ఎన్నికల్లో లబ్ది పొందాలని  నేతలు కేంద్ర మంత్రులను కూడా రంగంలోకి దించారు. బిజెపి రాష్ట్ర స్థాయి నేతలు అందరూ కూడా అక్కడే ఉండి ప్రచారం చేస్తూ ప్రభుత్వాన్ని బిజెపి ఇబ్బంది పెట్టె ప్రయత్నం కూడా చేయడం మనం చూస్తున్నాం. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి కాస్త ఘాటుగా స్పందిస్తున్నారు. ఇక ఇప్పుడు ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే అంబటి రాంబాబు బిజెపిని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేసారు.
బద్వేలు ఎన్నికల్లో గెలుపు ఖాయం అని అందరికీ తెలుసు అని అన్నారు. గెలిచే ఎన్నిక అయినా.. అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాం అని ఆయన వ్యాఖ్యలు చేసారు. అందరూ ఎన్నికల పోలింగ్ లో పాల్గొనాలని ప్రచారం చేస్తున్నాం అని అన్నారు. ఏ ప్రలోభాలు లేకుండా ఓటు వేయాలి అని విజ్ఞప్తి చేసారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు  మీకు అందిస్తున్నామని ప్రజలను ఉద్దేశించి అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమంపై అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు అని ఆయన హర్షం వ్యక్తం చేసారు.
కాంగ్రెస్ , బిజెపి లకు ఎందుకు ఓట్లు వేయాలి అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఛీల్చింది అని ఇప్పుడు అంతరించిపోతోంది అని ఎద్దేవా చేసారు. బిజెపి రాష్ట్రానికి అన్యాయం చేస్తోంది.. ఉనికే లేదని అన్నారు. కాంగ్రెస్ , బీజేపీ లకు డిపాజిట్ రాకుండా బుద్ధి చెప్పండి అని ఆయన విజ్ఞప్తి చేసారు. టీడీపీ , జనసేన పోటీ పెట్టకుండా లోపాయకారి ఒప్పందం.. లాలూచీ పడ్డారని అన్నారు. పవన్ కళ్యాణ్ ద్వంద వైఖరిపై తక్షణం క్లారిటీ ఇవ్వాలి అని ఆయన కోరారు. బద్వేల్ ప్రజలు చక్కని తీర్పు ఇవ్వనున్నారు అని ధీమా వ్యక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp

సంబంధిత వార్తలు: