షర్మిలతో ప్రముఖ యాంకర్ ?

Veldandi Saikiran
వైయస్ రాజశేఖర్ రెడ్డి  ముద్దుల కూతురు వైయస్ షర్మిల.. తెలంగాణ రాష్ట్రంలో  పార్టీ పెట్టిన సంగతి మనందరికీ విధితమే.  పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు అధికార టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నారు వైఎస్ షర్మిల. నిరుద్యోగులు, ప్రజల సమస్యలు మరియు రైతుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నారు వైయస్ షర్మిల. ముఖ్యంగా... సీఎం కేసీఆర్ మరియు అధికార టీఆర్ఎస్ పార్టీ లకు వ్యతిరేకంగా ప్రజల్లో గళం విప్పుతున్నారు వైయస్ షర్మిల. ఇక ఇందులో భాగంగానే మొన్నటి వరకు ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష పేరుతో... నిరుద్యోగుల నుంచి మంచి పేరు తెచ్చుకున్నారు వైయస్ షర్మిల.
గత వారం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి తరహాలోనే పాదయాత్ర ప్రారంభించారు వైయస్ షర్మిల. గత ఎనిమిది రోజుల కింద వైయస్ షర్మిల పాదయాత్ర ప్రారంభించగా... అది ఇప్పుడు విజయవంతంగా సాగుతోంది. అయితే తాజా గా ఇవాల్టి పాద యాత్ర లో... వై యస్ షర్మిల కు మ ద్దతు పలి కారు టాలీ వుడ్ నటి మరి యు ప్రముఖ యాంక ర్ శ్యామల. తన భర్త తో కలిసి  వైయస్ షర్మి ల పాద యాత్ర లో ఇవా ళ పాల్గొన్నారు యాంకర్ శ్యామల.
తనకు తన కుటుంబానికి... వైయస్సార్ ఫ్యామిలీతో చాలా మంచి అనుబంధం ఉందని... ఈ నేపథ్యంలోనే తాను వైయస్ షర్మిల పాదయాత్ర కు మద్దతు పలికినట్లు స్పష్టం చేశారు యాంకర్ శ్యామల. అయితే వైయస్ షర్మిల పాదయాత్రలో పాల్గొన్న వీరి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. ఇక అంతకు ముందు టీటీడీ పాలక మండలి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి మొన్నటి రోజున వైయస్ షర్మిల పాదయాత్రలో పాల్గొనగా...  నిన్న ఓ వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పాల్గొన్నారు. మొత్తానికి వైయస్ షర్మిల పాదయాత్ర... చాలా విజయవంతంగా సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: