కేసీఆర్ Vs. ఈటెల : ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే హుజూరాబాద్‌లో కారుకు పంక్చ‌రే..!

VUYYURU SUBHASH
తెలంగాణా రాష్ట్రం లోని 
 ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లా హుజూరాబాద్ ఎన్నికల ప్రచారం ఈ రోజు తో ముగియనుంది. అయితే ఈ సారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారంలో కి రాలేదు. వాస్త‌వంగా ఇక్క‌డ కేసీఆర్ కు ఓ బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేయాల‌ని అనుకున్నారు. అయితే ఎన్నిక‌ల క‌మిష‌న్ కొన్ని నిబంధ‌న‌లు పెట్ట‌డంతో చివ‌ర్లో కేసీఆర్ త‌న బ‌హిరంగ స‌భ‌ను ఇక్క‌డ పెట్ట లేదు. కేసీఆర్ అక్క‌డ‌కు వెళ్ల‌కుండానే హుజూరా బాద్ ఎన్నిక‌ల ప్ర‌క్రియ అయి తే ముగిసింద‌నే చెప్పాలి. అయితే దీనిని ఓ సెంటిమెంట్ గా బీజేపీ వాళ్లు సోష‌ల్ మీడియాలో పోస్టు లు పెడుతున్నారు.

కేసీఆర్ బ‌హిరంగ స‌భ‌లు పెట్టిన అన్ని ఉప ఎన్నిక‌ల్లోనూ టీఆర్ ఎస్ విజ‌యం సాధించింది. ఆయ‌న దుబ్బా క ఉప ఎన్నిక‌ల ప్ర‌చారానికి మాత్రం వెళ్ల‌లేదు. అక్క‌డ బాధ్య‌త అంతా మంత్రి హ‌రీష్ రావు మీదే పెట్టారు. అక్క‌డ టీఆర్ ఎస్ ఓడిపోయి బీజేపీ విజ‌యం సాధించింది. కేసీఆర్ కూడా దుబ్బాక ఓమ‌టి ఊహించలేదు. అయితే కేసీఆర్ హుజూర్ న‌గ‌ర్ , నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల ప్ర‌చారానికి మాత్రం వెళ్లారు. ఆ రెండు చోట్ల కూడా టీఆర్ ఎస్ గెలిచింది.

ఇక ఇప్పుడు హుజూరా బాద్‌లో కేసీఆర్ ఓడిపోతే హ‌రీష్‌కు ఎన్నిక‌ల్లో పార్టీని గెలిపించే సీన్ లేద‌ని క్రియేట్ చేస్తారా ? అన్న సందేహాలు ఉన్నాయి. మ‌రో టాక్ ప్ర‌కారం కేసీఆర్ పార్టీ ఎక్క‌డ అయితే ఓడిపోతుందో ఆ విష‌యం ముందుగానే గ్ర‌హించి అక్క‌డ ప్ర‌చారానికి వెళ్ల‌డం లేద‌ని మ‌రో టాక్ కూడా ఉంది. ఏదేమైనా ఇక్క‌డ టీఆర్ ఎస్ ఓడిపోతే మాత్రం అది హ‌రీష్ రావు అస‌మ‌ర్థ‌త అని టీఆర్ ఎస్లో కొంద‌రు అనే ఛాన్స్ ఉంది. బీజేపీ మాత్రం కేసీఆర్ సెంటిమెంట్‌తో తాము మ‌రోసారి గెలుస్తామ‌ని ధీమాతో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: