ఒక్క అపాయింట్మెంట్.... లెక్కలు మార్చేస్తుందా...?

Satya
కొన్ని సార్లు ఒకే ఒక్క అంశం పిక్చర్ ని కంప్లీట్ గా చేంజి చేస్తుంది. అంతలా పవర్ ఫుల్ గా ఆ అంశం ఉంటుంది అన్న మాట. ఏపీలో చూస్తే టగ్ ఆఫ్ వార్ జరుగుతోంది. ఎవరు ఎక్కువ. తక్కువ అని చెప్పడానికి లేకుండా అధికార వైసీపీ విపక్ష టీడీపీ ఢీ కొడుతున్నాయి.
మధ్యలో బీజేపీ ఎవరి పక్షం అంటే చెప్పడానికి కూడా లేదు. 2014 నాటి లెక్కలు, పొత్తులు చూసుకుంటే బీజేపీ టీడీపీ వైపే అని పసుపు పార్టీ భావిస్తోంది. కేంద్రంలోని బీజేపీకి చాలా అంశాల్లో మద్దతు ఇస్తున్నాం కాబట్టి బీజేపీ వైసీపీకి తోడుగా ఉంటుంది అని అధికార పార్టీ ధీమా. అయితే ఇదంతా బయట  అనుకోవడానికి బాగుంటుంది కానీ రాజకీయాలలో అసలు కుదిరే వ్యవహారం కాదు, ఇక్కడ శాశ్వత మిత్రులు శత్రువులు అంటూ ఉండరు. ఏ రోజు లెక్క ఆ రోజే తేలిపోతుంది.
వైసీపీ మద్దతు తీసుకుంటూనే టీడీపీకి సపోర్ట్ గా ఉండడమే గడుసు రాజకీయం. అమరావతి రాజధాని విషయంలో వైసీపీ కోరుకున్న విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించని సంగతి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఇక 2019 ఎన్నికల ముందు జగన్ కి ఫుల్ గా జనాల మద్దతు ఉంది. 2024లో కూడా అదే రిపీట్ అయితే లెక్కలు వేరుగా ఉంటాయి. కానీ ఒకసారి అధికారంలోకి వచ్చిన సర్కార్ కి వ్యతిరేకత ఉంటుంది. పైగా ఏపీ విభజన గాయాలతో బాధపడుతున్న రాష్ట్రం.  ఆ ట్రబుల్స్ అన్నీ కూడా పాలకులకే చుట్టుకునే పరిస్థితి.  ఇవ‌న్నీ చూసుకున్నపుడు వైసీపీతో ఉంటున్నట్లుగానే ఉంటూ టీడీపీ జట్టు కూడా కట్టేందుకు బీజేపీ రెడీ అయితే మాత్రం ఒక్కసారిగా ఏపీలో సమీకరణలు మారిపోతాయి. ఏపీలో వైసీపీ కూడా కేంద్రానికి కీలక బిల్లులలో మద్దతు ఇచ్చేందుకు వెనకాడవచ్చు. ఇదంతా ఒకే ఒక్క అపాయింట్మెంట్ మీద ఆధారపడిఉంది. ఆయనే అమిత్ షా. మరి అమిత్ షా చంద్రబాబు భేటీ ఎపుడు అంటే ఢిల్లీ వైపు చూడాల్సిందే.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: