కాశ్మీర్ లో మరో అడుగు.. సైన్యానికి మరింత బలం?

praveen
ఒకప్పుడు కాశ్మీర్ భారత్లో భూ భాగమైనప్పటికీ ప్రత్యేక ప్రతిపత్తి గల రాష్ట్రం గానే కొనసాగేది.  ఎందుకంటే అక్కడ 370 ఆర్టికల్ అమలులో ఉండేది. కానీ కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏకంగా 370 ఆర్టికల్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. అటు పాకిస్తాన్ 370 ఆర్టికల్ రద్దు చేయడం పై ఎంత గగ్గోలు పెట్టినప్పటికీ అటు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు.

 అయితే కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్లో అభివృద్ధి పై దృష్టి సారించింది. ఎన్నో ఏళ్ల నుండి అభివృద్ధికి నోచుకోని ప్రాంతంగా ఉన్న కాశ్మీర్ లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేసింది కేంద్రప్రభుత్వం. ఈ క్రమంలోనే కాశ్మీర్లో మారుమూల గ్రామాల్లో సైతం మౌలిక వసతులు కల్పించే దిశగా ఇప్పటికే సక్సెస్ సాధిస్తూ వస్తోంది. అయితే భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతమైన కాశ్మీర్ లో ఎప్పుడు ఉగ్రవాదులు ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కాశ్మీర్ ప్రాంతంలో కూడా మౌలిక వసతులు కల్పించడం పై ప్రస్తుతం భారత ప్రభుత్వం దృష్టి సారించింది.

 ఏకంగా కాశ్మీర్ ప్రాంతంలో ఒక రైలు మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు రైల్వేశాఖ నిర్ణయించింది.  గత కొన్ని రోజుల నుంచి రైల్వే శాఖ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే. జమ్మూ కాశ్మీర్ లోని ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భారత రైల్వే శాఖ మరో మైలురాయిని సాధించింది. కాటా- రియాస్ మధ్య రైల్వే లైన్ పూర్తయింది. అయితే జమ్మూ కాశ్మీర్ నుంచి అవతల వైపు వెళ్లేందుకు ఎలాంటి మార్గం లేనటువంటి నేపథ్యంలో ఇలా రైల్వేలైన్ అందుబాటులోకి రావడం శుభపరిణామం అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: