ఇక కరెంట్ కార్పొరేటే.. భారమైన కొనాల్సిందేనా..!

MOHAN BABU
గత కొద్ది రోజులలో విద్యుత్ అనేది సామాన్య ప్రజలకు అందకుండా పోయాయి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 
వ్యవసాయ చట్టాలతో పాటు ప్రజలకు భారంగా మారిన విద్యుత్ సవరణలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 11 నెలలుగా రైతాంగం చేస్తున్న ఆందోళనలను నామమాత్రంగా కూడా పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా పలు నిర్ణయాలను తీసుకుంటుంది. తాజాగా విద్యుత్ రంగంలోనూ అటువంటి నిర్ణయాన్నే తీసుకుంది. రెన్యువబుల్ ఎనర్జీ యూనిట్ ల నుండి తప్పనిసరిగా విద్యుత్ కొనుగోలు చేసి తీరాలని,రాష్ట్ర ప్రభుత్వాలను,పంపిణీ సంస్థలను ఆదేశించింది. వీటన్నింటినీ మస్ట్ రస్ యూనిట్ల పేర్కొంటు కేంద్రం ఈ చర్య తీసుకుంది.

ఈ మేరకు విద్యుత్ చట్టం 2003 లో చేసిన సవరణలను శనివారం నోటిఫై చేసింది. ఎలక్ట్రిసిటీ రూల్స్ 2021, ఎలక్ట్రిసిటీ రెన్యువబుల్ రూల్ 2021 లను ఈ నోటిఫికేషన్ ద్వారా కొత్తగా చేర్చింది. రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో  నిర్దేశించుకున్న లక్ష్యల సాధన కోసం పెట్టుబడిదారులను, ముఖ్యంగా విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఈ చర్య తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా కేంద్రం ప్రకటించడం గమనార్హం. దీంతో తక్కువ ధరకు లభించే విద్యుత్ అందుబాటులో ఉన్నప్పటికీ దాన్ని వినియోగించుకునే అవకాశం రాష్ట్రప్రభుత్వాలకు ఉండదు. ధర ఎక్కువైనా కార్పొరేట్లు ఏర్పాటుచేసే విద్యుత్ సంస్థల నుండే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతిమంగా ఈ భారం ప్రజలపై పడుతుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

మస్ట్ రస్ పవర్ ప్లాంట్ లుగా పరిగణించే రెన్యువబుల్ ఎనర్జీ విద్యుత్ యూనిట్ల ఉత్పత్తిని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆపడం కానీ, క్రమబద్దీకరించడం కానీ చేయకూడదని తాజా ఉత్తర్వుల్లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. విద్యుత్ కొనుగోలు సరఫరా ప్రాధాన్యతలను నిర్ణయించే మెరిట్ ఆర్డర్ డిస్పాచ్ ప్రకారంగానీ, లాభనష్టాలు పరిగణలోకి తీసుకునే ఇతర ఏ వాణిజ్య అంశాల ఆధారంగా కానీ ఈ ప్లాంట్ల నుండి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ఆపడం, క్రమబద్దీకరించడం చేయకూడదని ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: