బైడెన్ కు.. యుద్ధ అధికారాలు..!

Chandrasekhar Reddy
చైనా స్వార్థప్రయోజనాల కోసం మాత్రమే కాకుండా భారత్ కు తైవాన్ ఉత్పత్తి విస్తరించడం ఇష్టం లేకపోవడంతో దానిపై విరుచుకుపడటానికి సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలోనే తైవాన్ కు తాము అండగా ఉంటామని అమెరికా ప్రకటించింది. ఇప్పటికే తైవాన్ లో తమ సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసింది. అక్కడ ఉన్న వారికీ శిక్షణ కూడా ఇవ్వడం ప్రారంభించింది. అలాగే ఆయుధాల ను కూడా సమకూరుస్తుంది. ఈ చర్యలను చైనా తప్పుపడుతుంది. తన అంతర్గత విషయాలలో కల్పించుకోవడం సరికాదని హెచ్చరిస్తుంది. అయినా వెనక్కి తగ్గటం లేదు అమెరికా. మరో అడుగు ముందుకు వేసి, బైడెన్ ప్రభుత్వం ఆయనకు యుద్ధ అధికారాలను ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే ఒకవర్గం అందుకు  అడ్డుపడుతున్నప్పటికీ, చైనా తైవాన్ పై విరుచుకుపడినప్పుడు, ఈ అధికారాలను అప్పుడప్పుడే అమలు చేయడం సాధ్యం కాదని, అందుకే దానికి సంబందించిన కార్యాచరణ అప్పుడే ప్రారంభించాలని మరో వర్గం అంటున్నారు.
ఏది ఏమైనా తైవాన్ కు అమెరికా ఖచ్చితంగా అండగా ఉండేందుకు సిద్ధం అవుతుంది. ఎప్పుడు చైనా దుందుడుకుగా మీదకు వచ్చినా, అమెరికా అందుకు సిద్ధంగా ఉండేందుకు కృషి చేస్తుంది. నిజానికి భారత్ పైకి రావాలని చైనా అనుకుంది. తద్వారా మరోవైపు నుండి పాక్ ను ఉసిగొలిపి, ఒక్కసారిగా రెండు దేశాలతో భారత్ యుద్ధం చేసి, ఆర్థికంగా చితికిపోవాలని వ్యూహం పన్నింది. అలాంటిది చైనానే ఇప్పుడు అమెరికా, తైవాన్ లతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి కొని తెచ్చుకుంటుంది. అంటే చైనా తాను తీసుకున్న గోతిలో తానే పడుతుంది. అయితే ఒక్కసారి యుద్ధం అంటూ మొదలైతే తైవాన్ కు అండగా మరికొన్ని దేశాలు కూడా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అలాగే సందుదొరికింది కదా అని పాక్ కూడా భారత్ పైకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. అలాగే చైనా కూడా పనిలోపని అని రెండు రాకెట్లను భారత్ పైకి పంపే అవకాశాలు కూడా లేకపోలేదు. అంటే యుద్ధం ఎక్కడ ఎవరు ప్రారంభించినప్పటికీ, భారత్ పై మాత్రం ప్రభావం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ చైనా వెనకడుగు వేయాల్సి వస్తే, అప్పుడు కూడా ఒక్కదెబ్బైనా భారత్ ను కొట్టే పడాలని అనుకునే సందర్భాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. తాజా పరిస్థితి చుస్తే మాత్రం చైనా యుద్దానికి సై అన్నట్టే ఉన్నప్పటికీ, ప్రారంభం ఇంకేవైనా చేస్తే, రేపటి రోజున తాను ముందు ప్రారంభించలేదు అనే సాకు చెప్పుకోవచ్చు అనేది దాని ఆలోచన. కానీ ఇప్పట్లో యుద్ధం చేయాల్సిన అవసరం మాత్రం చైనాకు తప్ప మరెవరికి లేదు. అంటే యుద్ధం వచ్చినా, చైనాకు మరోసారి ప్రపంచం ముందు భంగం తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: