చైనాకు షాకిచ్చిన 43 దేశాలు.. ఎలాగంటే?

praveen
చెడపకురా చెడేవు అనే ఒక సామెత దాదాపు అందరికి తెలిసిందే.. అయితే ఈ సామెత ప్రస్తుతం చైనా కు సరిగ్గా సరిపోతుంది   ఎందుకంటే ప్రపంచ దేశాలలో ఏ చిన్న విషయం జరిగిన దానిని పెద్దగా చేసి ఎన్నో శాంతి వచనాలు వల్లిస్తూ ఉంటుంది చైనా. ఎప్పుడు విస్తరణలో ధోరణితో వ్యవహరిస్తు ఇక అన్ని భూభాగాలు కూడా తమవే అన్నట్లుగా వివాదాలకు తెర లేపుతోంది. ఇలా ఇతర దేశాలకు శాంతి వచనాలు వల్లించే చైనా తమ దేశంలో మైనారిటీల పట్ల మాత్రం దారుణంగా వ్యవహరిస్తూ ఉంటుంది. మైనార్టీలను కనీసం మనుషులుగా కూడా చూడదు చైనా. ఈ క్రమంలోనే చైనాలో  వీకర్ ముస్లింల పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే.

 కనీస స్వేచ్ఛ లేని బ్రతుకును ప్రస్తుతం చైనాలో వీకర్ ముస్లింలు బ్రతుకుతున్నారు  ఎందుకంటే చైనాలో నియంతృత్వ ధోరణితో వ్యవహరించే ప్రభుత్వం వీకర్ ముస్లింల మత ఆచారాలను పూర్తిగా మర్చికోవాలంటూ రూల్స్ పెట్టింది  అంతేకాకుండా మసీదులను కూల్చి వేసింది. ఇక వీకర్ ముస్లింల ఎవరూ కూడా ఇస్లామిక్ భాషలో మాట్లాడకూడదని కేవలం చైనా భాష మాత్రమే మాట్లాడాలి అంటూ ఎన్నో నిబంధనలు కూడా పెట్టింది. అంతే కాదు వీకర్ ముస్లింల తమ భాషలో చదువుకునేందుకు అస్సలు అనుమతించలేదు చైనా. ఇన్ని అరాచకాలు సృష్టిస్తూ ప్రపంచ దేశాలకు మాత్రం శాంతి వచనాలు కల్లబొల్లి మాటలు చెబుతూ ఉంటుంది.  వీకర్ ముస్లింల విషయంలో చైనా వ్యవహరిస్తున్న తీరు ఎప్పటినుంచో హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.

 ఇప్పుడు ఇదే విషయంలో నక్క జిత్తుల మారి చైనాకు ఐక్య రాజ్యసమితి వేదిక ఊహించని షాక్ ఎదురైంది. వీకర్ ముస్లింల విషయంలో చైనా వ్యవహరిస్తున్న తీరుపై 43దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఐక్యరాజ్య సమితి వేదికగా నిలదీశాయి. వీకర్ ముస్లింలపై చైనా ప్రభుత్వం  అరాచకంగా ప్రవర్తిస్తుంది .. ఇది ప్రజాస్వామ్యానికి కాలరాస్తున్నట్లే అవుతుంది అంటూ 43 దేశాలు నిలదీశాయి. ఈ క్రమంలోనే కవర్ చేసేందుకు ప్రయత్నిస్తుంది చైనా. వీకర్ ముస్లింలు మాట్లాడుతున్నట్లుగా కొన్ని వీడియోలు విడుదల చేసింది. తమకు చైనా అంటే ఇష్టమని తమకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ వీకర్ ముస్లింల చేసిన వీడియోలు విడుదల చేసి కవర్ చేసుకునే ప్రయత్నం మొదలు పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: