ఇండియా మరో సక్సెస్.. ఇప్పుడు కే9 వజ్ర?

praveen
భారత్ దూసుకుపోతుంది.. కేవలం ఒక్క రంగంలోనే కాదు అన్ని రంగాలలో కూడా భారత్ ప్రపంచ దేశాలకు పోటీ ఇస్తుంది.  భారత్ వ్యూహాత్మకంగా ముందుకు దూసుకుపోతున్న తీరు ప్రపంచ దేశాలకు సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎన్నడూ లేని విధంగా భారత్ వృద్ధి రేటు కూడా పెరిగిపోతుంది. అన్ని రంగాల్లో సూపర్ సక్సెస్ సాధిస్తుంది భారత్.  ప్రస్తుతం వెనుకబడిన దేశం గా పేరున్న భారత్ అగ్రరాజ్యాలను సైతం ఆశ్చర్యపరుస్తూ తమ సత్తా చాటుతోంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా వెనుకబడిన దేశంగా ఉన్న భారత్ ఏకంగా ఆయుధాల విక్రయాలను ప్రారంభించడం మాత్రం అగ్రరాజ్యాలకు ఊహించని షాక్ అనే చెప్పాలి.

 భారత్ కి ఆయుధాలు అవసరమైనప్పుడల్లా ఎప్పుడూ రష్యా,అమెరికా, జపాన్, ఫ్రాన్స్ లాంటి దేశాలపైన ఎక్కువగా ఆధారపడింది భారత్. ఇక ఆయా దేశాలలో ఉన్న ఆయుధాలను లక్షల కోట్లు వెచ్చించి కొనుగోలు చేస్తూ ఉండేది. ఈ క్రమంలోనే అగ్ర రాజ్యాలుగా కొనసాగుతున్న ఆయా దేశాలు భారత్ పై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తూ ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రక్షణ రంగం అంతకంతకూ పటిష్టంగా మారిపోతుంది. ఇప్పటికే భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ డిఆర్డిఓ అధునాతనమైన ఆయుధాలను తయారు చేయడమే కాదు వాటికి ప్రయోగాల నిర్వహించి భారత అమ్ములపొదిలో చేరుస్తుంది.

 అంతేకాదు మేడిన్ ఇండియా లో భాగంగా  తయారు చేసిన ఎన్నో ఆయుధాలను వివిధ దేశాలకు విక్రయించేందుకు కూడా సిద్ధమౌతుంది  ఇప్పటికే బ్రహ్మోస్ మిస్సైల్ లాంటి ఆయుధాలను వివిధ దేశాలకు విక్రయించేందుకు భారత్ ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది అన్న విషయం తెలిసిందే   ఇక ఇప్పుడు మరో ఆయుధం విక్రయానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. మేకిన్ ఇండియా లో భాగంగా సౌత్ కొరియా తో కలిసి భారత్లో జాయింట్ కే9 వజ్ర అనే ఆయుధాన్ని తయారుచేసింది భారత్. ఈ ఆయుధాన్ని  కూడా విక్రయించేందుకు ఇరు దేశాలు ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: