పాక్ మరో ముందడుగు.. తాలిబన్లకు కోసం?

praveen
ఉగ్రవాదానికి మరో రూపమైన తాలిబన్లు ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో  అధికారాన్ని చేపట్టిన అరాచకాలు సృష్టిస్తున్నాడు అనే విషయం తెలిసిందే. అయితే దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఇలాగే ఆధిపత్యాన్ని చేపట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబాన్లు ఎన్నో అరాచకాలు సృష్టించారు. కానీ ఈసారి మాత్రం తాము మారిపోయాము అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఇక తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మాత్రం తాలిబన్లు తెరమీదికి తెస్తున్న రూల్స్ ఇక ప్రజలను హింసిస్తున్న తీరు ఒకప్పటి తాలిబన్ల పాలనే తలపిస్తోంది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో మహిళల పరిస్థితి అయితే ఆగమ్యగోచరంగా మారిపోయింది. మహిళలు చదువుకో కూడదని ఉద్యోగాలు చేయకూడదు అంటూ ఎన్నో రూల్స్ కూడా పెట్టారు.

 ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్లో తాలిబాన్ల ప్రభుత్వాన్ని అంతర్జాతీయ సమాజం మొత్తం వ్యతిరేకిస్తూనే ఉంది. ఏ దేశం కూడా తాలిబన్ల ప్రభుత్వాన్ని ఆహ్వానించేందుకు ముందుకు రావడం లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి సమయంలో అటు పాకిస్థాన్ మాత్రం తాలిబాన్ లకు మద్దతు ఇస్తూనే వస్తుంది అన్న విషయం తెలిసిందే.  అయితే తాలిబన్లు ఆధిపత్యాన్ని చేపట్టడంతో ఆఫ్ఘనిస్తాన్ తో అన్ని దేశాలకు సంబంధాలు తెగిపోయాయ్. ఈ సంబంధాలను పునరుద్ధరించేందుకు పాకిస్తాన్ సర్వ ప్రయత్నాలను చేస్తుంది.  ఇక ఇప్పుడు తాలిబన్ల కోసం పాకిస్తాన్ మరో అడుగు ముందుకేసింది.

 పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖురేషి ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్ పర్యటనకు వెళ్లారు.. కాగా అక్కడ తాలిబన్లు పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రికి  స్వాగతం పలికారు.  ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ అత్యంత సురక్షితమైన ప్రదేశమని ప్రపంచ దేశాలకు చెప్పడానికి పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఖురేషి ఇలా ఆఫ్ఘనిస్తాన్ పర్యటనకు వెళ్లారు అని అటు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  పాకిస్తాన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అటు తాలిబన్లను ప్రపంచ దేశాలు నమ్మే పరిస్థితులు మాత్రం లేవు అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: