ఓల్డ్ సిటీ మిని పాకిస్తాన్‌..! రాజాసింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

N ANJANEYULU
గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్  నిత్యం ఏదో ఒక వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేసి వార్త‌ల్లో నిలుచుతారు. తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. ఓ టీవీ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడారు.
గోషామ‌హ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో చాలా అభివృద్ధి చేశాను. ముఖ్య‌మంత్రి వ‌ల్ల‌నే దూల్‌పేట‌లో గుడుంబా బంద్ చేశారు. కానీ ఇక్క‌డ గంజాయి ఎక్కువ ఉంది. నేను గంజాయికు మ‌ద్ద‌తు ఇవ్వ‌ను. దూల్‌పేట‌ను మోడ‌ల్ గా త‌యారు చేయాల‌నేది నా క‌ల‌. దూల్‌పేట‌కు మంచి పేరు రావాలంటే ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. ఎంఐఎం తొలుత ప్రారంభిస్తారు. మేము త‌రువాత కౌంట‌ర్ ఇస్తాం. దీంతో అంద‌రూ మ‌మ్ముల్ని విమ‌ర్శిస్తారు. దేశ‌ద్రోహ పార్టీ ఎంఐఎం పార్టీ. ఎంఐఎంను విడిచేది లేదు.
 
తెలంగాణ‌లో బండి సంజ‌య్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. రాజాసింగ్ అభివృద్ధి చేస్తున్నాడు కాబ‌ట్టే రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ప్ర‌జ‌లు అని పేర్కొన్నారు.  చిల్ల‌ర రాజ‌కీయాలు చేయ‌ను. దేశ‌ద్రోహుల‌లైన ఎంఐఎంను విమర్శిస్తాం. అక్బ‌రుద్దీన్‌పై కోర్టులో కేసు న‌డుస్తుంది. బీజేపీ ప్ర‌భుత్వం తెలంగాణలో అధికారంలోకి వ‌స్తే ఎంఐఎం నాయ‌కుల‌ను, త‌ప్ప‌కుండా శిక్షిస్తాం. ఎంఐఎంను తిట్టాల‌ని నాకు ఉండ‌దు ఎంఐఎం నేత అక్బ‌రుద్దీన్ ఓవైసీకి మ‌ర్యాద‌గా చెబితే విన‌డు. అందుకే అర్థ‌మ‌య్యే భాష‌లో మాట్లాడుతాను. నాదేశంలో ఉండి దేశానికి ద్రోహం చేస్తే ఎలా అని ప్ర‌శ్నించారు.   ఓల్డ్ సిటీ మిని పాకిస్తాన్‌లాగా త‌యారైంది. దానికి కార‌ణం ఎంఐఎం అని రాజాసింగ్ పేర్కొన్నారు
బీజేపీ దేశ ర‌క్ష‌ణ కోసం, ధ‌ర్మ‌ర‌క్ష‌ణ కోసం ప‌ని చేస్తుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా మోడీ మీద ప్రేమ ఉంది. ఒక‌ప్పుడు దేశంలో ఎన్నో కుట్ర‌లు జ‌రిగాయి. బీజేపీ అధికారంలోకి వ‌చ్చాక ఉగ్ర‌వాదుల కుట్ర‌ల‌ను ఆపుతోంద‌ని వెల్ల‌డించారు రాజాసింగ్‌. కాంగ్రెస్ క‌తం అయిపోయింది భార‌త్‌లో. ఎంఐఎంకు కాంగ్రెస్ పాలు తాపిస్తుంది. తెలంగాణ‌లో పాము అయిన ఎంఐఎంకు ప్ర‌స్తుతం టీఆర్ఎస్ పాలు పోస్తుంద‌ని విమ‌ర్శించారు. కిష‌న్‌రెడ్డి, ల‌క్ష్మ‌ణ్‌ల‌తో  నాకు ఎలాంటి విభేదాలు లేవని స్ప‌ష్టం చేశారు. బీజేపీలో మిగ‌తా పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవు. అంద‌రం క‌లిసి ఉంటాం. హుజూరాబాద్‌లో బీజేపీ, టీఆర్ఎస్ మ‌ధ్య తీవ్ర‌ పోటీ నెల‌కొంద‌ని వెల్ల‌డించారు. ఓడిపోతమా, గెలుస్తామా అనేది ప్ర‌జ‌ల నిర్ణ‌యం. కాంగ్రెస్ కు, బీజేపీకి మ‌ద్య హుజూరాబాద్‌లో పోటీ లేనే లేదు. రాజాసింగ్ ఎక్క‌డి నుంచి పోటీ చేస్తాడ‌నేది బీజేపీ అధ్య‌క్షుడు నిర్ణ‌యిస్తాడ‌ని ఇటీవ‌ల జ‌రిగిన ఓ ఇంటర్వ్యూలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వెల్ల‌డించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: