వరదల్లో చనిపోతే అయిదు లక్షలు: సిఎం ప్రకటన

Sahithya
ఉత్తరాఖండ్ లో వరదల దెబ్బకు ఇప్పుడు ప్రజలు అక్కడ చుక్కలు చూస్తున్నారు. ఈ వరదల దెబ్బకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలకు దిగింది. చాలా వరకు సిఎం పుష్కర్ సింగ్ దామీ ప్రజల్లోనే ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా అక్కడ మరణించిన వారికి ఆర్ధిక సహాయం చేసే ప్రయత్నం చేస్తుంది. వరదల వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. భారీ వరదల వల్ల 11 మంది గల్లంతు.. చాలా మంది క్షతగాత్రులు అయ్యారు అని అక్కడి ప్రభుత్వం పేర్కొంది.
వరద సహాయక ఏర్పాట్ల కోసం ప్రతి జిల్లా కలెక్టర్ కి 10కోట్ల రూపాయలను విడదల చేసింది అక్కడి రాష్ట్ర ప్రభుత్వం. నిన్నటి నుంచి ఉత్తరాఖండ్ లో తగ్గు ముఖం పట్టాయి వర్షాలు. గత నాలుగు రోజుల నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు చుక్కలు చూస్తున్నారు. భారీ వర్షాల వరదల వల్ల చాలా ప్రాంతాల్లో దారుణమైన పరిస్థితి కనపడింది. రోడ్లు, వంతెనలు వర్షాల వల్ల కోట్టుకపోయాయి అని ఆయన పేర్కొన్నారు. కొండచర్యలు విరిగిపడటం వల్ల చాలా ప్రాంతాలకు రోడ్లు మార్గాలు మూసుకుపోయాయని తెలిపారు.
యుద్ద ప్రాతిపదికన రోడ్లు మార్గాలకు మరమత్తులు చేస్తున్నారు అధికారు. వర్షాల వల్ల చాలా గ్రామాలు వరదల్లో చిక్కుకుపోవడం పెద్ద సమస్యగా మారింది. కరెంట్ సరఫరా కూడా చాలా గ్రామాలకు లేదు. చార్ దామ్ యాత్రకు వచ్చిన ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేసింది అక్కడి ప్రభుత్వం. వారిని వారి రాష్ట్రాలకు పంపించే ప్రయత్నం చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. రోడ్డు కోట్టుకపోవటం వల్ల కీలో మీటర్ల మెరకు ట్రాపిక్ జామ్ కూడా ఏర్పడింది. ట్రాఫిక్ ని వేరే మార్గాల ద్వారా మళ్ళించారు. ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నాము అని అధికారులు వివరించారు. వదరల్లో చిక్కుకపోయిన వారిని రక్షించేందుకు ప్రయత్నం చేస్తున్నాము అని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామీ ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: