తల్లి కావాలనే కోరిక.. 70 ఏళ్ళ వయస్సులో తీరింది?

praveen
ప్రతి అమ్మాయికి తన కలల రాకుమారుడు ని పెళ్లి చేసుకుని ఒక సరికొత్త జీవితాన్ని ప్రారంభించాలి అని ఎలా కోరుకుంటుందో పెళ్లి తర్వాత తల్లి కావాలని ఒక బిడ్డకు జన్మనివ్వనివ్వాలని కూడా అంతే కోరుకుంటుంది అనే విషయం తెలిసిందే. అయితే కొంతమందికి పెళ్లయిన కొన్నేళ్లలోనే పిల్లలు పుట్టడం జరుగుతూ ఉంటుంది. కానీ కొంతమంది మాత్రం అటు దేవుడి కటాక్షం పొందలేక పిల్లలు పుట్టకపోవడం తో చివరికి ఎంతగానో నిరాశ చెందుతూ మనస్థాపం తోనే బ్రతుకుతూ ఉంటారు. అయితే డాక్టర్ల చుట్టూ తిరిగినప్పటికి ఇక ఎలాంటి ఉపయోగం ఉండదు. దీంతో నిరాషలోనే బ్రతికేస్తూ ఉంటారు చాలా మంది మహిళలు.

 ఇక అలాంటి మహిళలందరూ కూడా ఇక్కడ మనం మాట్లాడుకునే భామ్మా గురించి తెలిస్తే మాత్రం ఆనందంతో ఎగిరి గంతేస్తారు అనే చెప్పాలి. సాధారణంగా మహిళలు  పిల్లలు కనడానికి ఒక నిర్దిష్టమైన వయస్సు ఉంటుంది అని డాక్టర్లు చెబుతూ ఉంటారు. కానీ నేటి రోజుల్లో మాత్రం వయస్సుతో సంబంధం లేకుండా మహిళలు శిశువుకు జన్మనిస్తు ఉండటం జరుగుతుంది. ఇక ఇలాంటి ఘటనలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. అయితే సాధారణంగా 70ఏళ్ల వయసులో ఎవరైనా ఏం చేస్తారు కృష్ణా రామా అనుకుంటూ ఇంట్లో ఏ మూలన కూర్చుని హాయిగా రెస్ట్ తీసుకుంటూ ఉంటారు.

 ఇక మనవడు మనవరాల్లతో ఆడుకుంటారు. కానీ ఇక్కడ ఒక 70 ఏళ్ల వృద్ధురాలికి మాత్రం మనవడు మనవరాలు లేరూ. ఎందుకంటే ఆమెకి పెళ్లి అయ్యి పిల్లలు పుట్టలేదు. అయ్యో పాపం అని అంటారా. ఆమె మాత్రం అలా అనుకోలేదు. పిల్లలు కావాలని ప్రయత్నాలు మాత్రం ఆపలేదు. ఈ క్రమంలోనే ఇటీవల ఏకంగా 70 ఏళ్ళ వయసులో బిడ్డకు జన్మనిచ్చింది సదరు వృద్ధురాలు. ఈ ఘటన గుజరాత్లోని మోరాలో వెలుగులోకి వచ్చింది. మోరా కు చెందిన జీవున్ బెన్ రబరి, బాల్దారీ దంపతులకు 45 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పిల్లలు పుట్టలేదు. అయితే మహిళ వయసు పెరుగుతున్నప్పటికీ ఆమె తల్లి కావాలనే కోరిక మాత్రం తీరలేదు. చివరికి ఐవిఎఫ్ పద్ధతిలో గర్భం దాల్చి ఒక బిడ్డకు జన్మనిచ్చింది. 70 ఏళ్ల వయసులో ఇక ఆ మహిళ తన కల నెరవేర్చుకుంది. ప్రపంచంలోనే అత్యధిక వయసులో తల్లి అయిన కొద్ది మంది మహిళలు సరసన ఆమె చేరి ఒక సరికొత్త రికార్డు సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: