ఓవైపు రాబడి + మరోవైపు దోపిడీ = కేంద్ర సర్కార్..!

MOHAN BABU
మనదేశం రెవెన్యూ పెరిగిపోతోంది. రాబడి ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. కరోనా కారణంగా గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం అన్నట్లుగా ఉన్న దేశ ఆదాయం, ఆర్థిక పరిస్థితి క్రమంగా సర్దుకొని ఇప్పుడిప్పుడే పరుగులు పెడుతోంది. జీఎస్టీ లు, ఎక్సైజ్ జూటీలు, ఆ టాక్స్ లు ఈ టాక్స్ లు లెక్కేస్తే  కేంద్రానికి భారీగా ఆదాయం సమకూరుతుంది. రాబడి విషయంలో భారీ గ్రోత్ కనిపిస్తుంది.

గ్రాస్ డైరెక్ట్ టాక్స్ కలెక్షన్లలో 47%, నెట్ డైరెక్ట్ టాక్స్ కలెక్షన్లలో 74% గ్రోత్ నమోదయింది. ఇంకా అడ్వాన్స్డ్ టాక్స్ కలెక్షన్లకు సంబంధించి  56 శాతం ఎదుగుదల ఉండగా సెప్టెంబర్ నాటికి రెండు లక్షల 53 వేల కోట్లకు పైగా వసూలైంది. రిఫండ్ల ద్వారా  75 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. 2021- 22  రెండవ త్రైమాసికంలో నెలకు యావరేజ్ గా లక్షల 15 వేల కోట్ల రూపాయలు కేంద్రం ఖజానాకు వచ్చి చేరాయి. ఈ ఫైనాన్షలియర్లు 22 లక్షల కోట్లకు పైగా ఆదాయం రాబట్టాలని కేంద్రం టార్గెట్ గా పెట్టుకుంది.థర్డ్ వేవ్ లాంటివి రాకపోతే అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఈ టార్గెట్ అందుకోవడం పెద్ద మ్యాటర్ ఏం కాదు.

అయితే ఈ డైరెక్ట్, ఇన్ డైరెక్ట్ అడ్వాన్స్ టాక్స్ లు ఓ సగటు భారతీయునికి అర్థం కాని లెక్కలు. ఇంత రాబడి ఉంది కదా మరి ఎందుకు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గడం లేదు. కనీసం తగ్గించే ఆలోచన కూడా చేయడం లేదు అని సామాన్య మానవుని లో తలెత్తుతున్న ప్రశ్న. పెట్రోల్ ధరలు అందుబాటులోకి రావాలంటే కేంద్రంతో పాటు రాష్ట్రాలు కొంత ఆదాయాన్ని వదులుకోవాలి. పెట్రోల్ ధరలు పెరుగుతూ పోతే ఆ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడే అవకాశం  ఉంది. దేశానికి ఎంత రాబడి ఉన్నా పేద ప్రజల పై మాత్రం పన్ను బారాలు, అలాగే గ్యాస్ పెట్రోల్ ధరలు పెంచి పెద ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: